తిరుపతిలో అమానవీయ ఘటన.. ఎంపీ తీవ్ర ఆగ్రహం
ఏపీలో తిరుపతి రుయా ఆస్పత్రిలో జరిగిన అమానవీయ ఘటన పై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంబులెన్స్ మాఫియా కారణంగా బిడ్డను తండ్రి ద్విచక్రవాహనంపై 90 కి.మీ పాటు తీసుకెళ్లిన ఘటన మంగళవారం ఉదయం చోటు చేసుకుంది. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. కాగా.. ఈ ఘటనపై స్పందించిన తిరుపతి ఎంపీ గురుమూర్తి కలెక్టర్ వెంకటరమణ రెడ్డికి ఫోన్ చేసి ఈ విషయంపై విచారణ జరిపి ఈ విషయంలో బాధ్యుల మీద కఠిన చర్యలు తీసుకోవాలని భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగు చర్యలు తీసుకోవాలని కోరారు. ఇందుకు స్పందించిన కలెక్టర్ ఈ సంఘటనపై విచారణ జరుపుతున్నామని ఈ ఘటనకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. అలాగే రుయా హాస్పిటల్ సూపరింటెండెంట్ భారతితో కూడా మాట్లాడి ఈ ఘటనపై సమగ్ర విచారణ జరపాలని కోరారు.