Tirumala: ముగిసిన శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం
Tirumala:తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో వైకుంఠద్వార దర్శనాలు బుధవారంతో ముగిశాయి. జనవరి 2వ తేదీన వైకుంఠ ఏకాదశి సందర్భంగా టీటీడీ 11వ తేదీ వరకు పదిరోజుల పాటు టీటీడీ వైకుంఠ ద్వార దర్శనాలను కల్పించింది. ఇందులో భాగంగా బుధవారం అర్ధరాత్రి ఏకాంత సేవతో పాటు శాస్రోతకంగా అర్చకులు పూజలు నిర్వహించి ఉత్తర ద్వారాలను మూసివేశారు. నేటినుండి నుంచి యథావిధిగా శ్రీవారి కార్యక్రమాలు జరగనున్నాయి. తిరుమలలో భక్తుల రద్దీ అధికంగా కొనసాగుతుంది. టికెట్లు పొందిన భక్తులకు కేటాయించిన నిర్ణీత సమయంలో దర్శనం భాగ్యం కల్పిస్తున్నారు అధికారులు.
నాటి అర్ధరాత్రి 58,000 మంది స్వామివారిని దర్శించుకున్నారని అధికారులు చెపుతున్నారు. ప్రతీ రోజు 80వేల మందికి అవకాశం ఇచ్చినా కూడా భక్తులు ఎక్కువగా ఆసక్తి చూపలేదు. 16,000మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.4.20 కోట్లు ఆదాయం సమకూరింది. ఇక ఇదే సమయంలో తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వెంకటేశ్వరరెడ్డి, ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె.శ్రీనివాసరెడ్డి, వైకుంఠ ద్వారంలో స్వామిని దర్శించుకున్నారు.