Tirumala Face Recognition Technology: ఏప్రిల్ 1 నుండి పూర్తిస్థాయిలో అందుబాటులోకి
Tirumala Face Recognition Technology: తిరుమలలో ఇటీవలే ముఖ గుర్తింపు సాంకేతికతను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ టెక్నాలజీ అందుబాటులోకి తీసుకురావడంతో సర్వదర్శనం కోసం వచ్చే భక్తులకు లడ్డూ ప్రసాదాల విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉంటుంది. అదేవిధంగా గదుల కేటాయింపు విషయంలోనూ ఇబ్బందులు తలెత్తడం లేదని అధికారులు చెబుతున్నారు. తిరుమలకు వచ్చే భక్తులకు కేవలం 5 నుండి 10 నిమిషాల సమయంలోనే గదులను కేటాయిస్తున్నట్లు ఈవో ధర్మారెడ్డి తెలిపారు.
క్యూ కాంప్లెక్స్‌లోనూ ఉచిత లడ్డూ పంపిణీలో కూడా ఈ టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొచ్చారు. కాలినడకన తిరుమలకు వచ్చే భక్తులకు టైంస్లాట్ టోకెన్లు జారీ చేసే విధానంపై టీటీడీ కసరత్తు చేస్తున్నది. ఈ విధానంలో కూడా టెక్నాలజీని అందుబాటులోకి తీసుకురావడం ద్వారా శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులు మరింత సులభంగా స్వామివారిని దర్శించుకుంటారని టీటీడీ తెలియజేసింది. ముఖ గుర్తింపు టెక్నాలజీని ఏప్రిల్ 1 వ తేదీ నుండి పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురానున్నట్లు టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలియజేశారు. వేసవి ప్రారంభం కానున్న నేపథ్యంలో తిరుమలకు భక్తుల తాకిడి పెరిగే అవకాశం ఉంది. దీనిని దృష్టిలో పెట్టుకొని అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎంతమంది భక్తులు తిరుమలకు వచ్చినా అందరికి సౌకర్యాలు కల్పించేలా చర్యలు తీసుకుంటున్నారు.