స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై హైకోర్టులో ఈ రోజు విచారణ జరగనుంది.
Chandrababu : స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై హైకోర్టులో ఈ రోజు విచారణ జరగనుంది. దీంతో పాటు.. ఏసీబీ కోర్టులో చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన బెయిల్, మధ్యంతర బెయిల్ పిటిషన్‌పైనా కూడా ఈ రోజు విచారణ జరగనుంది. అలాగే సీఐడీ వేసిన కస్టడీ పిటిషన్‌పైన కూడా వాదనలు జరిగే అవకాశముంది.
అయితే ఈ కేసులో ముగ్గురు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులు చంద్రబాబు తరుఫున వాదించేందుకు రంగంలోకి దిగుతున్నారు. ప్రముఖ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా(Siddhartha Luthra)తో పాటు మరో ఇద్దరు సీనియర్ న్యాయవాదులు హరీష్ సాల్వే(Harish Salve), సిద్ధార్థ అగర్వాల్(Siddhartha Aggarwal) కూడా చంద్రబాబు తరుఫున వాదనలు వినిపించబోతున్నారు.
మరోవైపు రిమాండ్ ఉత్తర్వులు సస్పెన్షన్‌పై.. సీఐడీ తరపున దేశ అత్యున్నత న్యాయస్థానం సీనియర్ న్యాయవాది ముఖుల్ రోహత్గి(Mukul Rohatgi)..తన వాదనలు వినిపించనున్నట్లు తెలుస్తోంది.