ప్రస్తుత సమయంలో జోక్యం చేసుకోలేం, జీవో నెంబర్ 1 కేసులో సుప్రీంకోర్టు స్పష్టీకరణ
This is not the right time to interfere, says SC on GO Number 1 case
ఏపీ ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో నెంబర్ 1 విషయమై సుప్రీంకోర్టులో విచారణ పూర్తయింది. ప్రస్తుతం ఈ కేసు ఏపీ హైకోర్టులోనే ఉన్నందున తాము జోక్యం చేసుకోమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ నెల 23న హైకోర్టు చీఫ్ జస్టిస్ విచారణ జరపాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.
ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ 1 పై స్టే విధిస్తూ కొన్ని రోజుల క్రితం హైకోర్టు తీర్పు ఇచ్చింది. హైకోర్టు ఇచ్చిన ఈ తీర్పును ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. సవాలు చేస్తూ ఏపీ సర్కార్ పిటిషన్ వేసింది. ఈ పిటిషన్ పై ఈ రోజు విచారణ జరిగింది. ప్రస్తుత పరిస్థితుల్లో తాము జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
ఏపీలో రోడ్లపై సభలు, సమావేశాలు, రోడ్డు షోలు నిర్వహించేందుకు ప్రభుత్వం నిబంధనలు కఠినతరం చేసింది. నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని చెబుతూ జీవో నెంబర్ 1 జారీ చేసింది. ప్రభుత్వం జారీ చేసిన ఈ జీవోపై టీడీపీ అసంతృప్తి వ్యక్తం చేసింది. హైకోర్టును ఆశ్రయించింది.