తెలుగు రాష్ట్రాలలో వేసవి కాలంలో వానలు దండిగా పడ్డాయి. సమ్మర్ సీజన్ లో కురవాల్సిన సాధారణం కన్నా భారీగా వర్షపాతం నమోదైంది. అన్ని జిల్లాల్లోనూ వర్షపాతం సాధారణం కన్నా ఎక్కువగా రికార్డయింది. తెలంగాణలోని 32 జిల్లాల్లో అధిక వర్షపాతం నమోదయింది.
Weather: తెలుగు రాష్ట్రాలలో వేసవి కాలంలో వానలు దండిగా పడ్డాయి. సమ్మర్ సీజన్ లో కురవాల్సిన సాధారణం కన్నా భారీగా వర్షపాతం నమోదైంది. అన్ని జిల్లాల్లోనూ వర్షపాతం సాధారణం కన్నా ఎక్కువగా రికార్డయింది. తెలంగాణలోని 32 జిల్లాల్లో అధిక వర్షపాతం నమోదయింది. ఈ మేరకు వాతావరణ శాఖ ఒక రిపోర్టును విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఈ 2023 మార్చి 1 నుంచి మే 20దాకా 14.61 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మామూలుగా అయితే సమ్మర్ సీజన్లో కురవాల్సిన వర్షాలు 5.48 సెంటీమీటర్లే. అయితే సగటు కన్నా 167 శాతం అధికంగా వర్షాలు కురిశాయి. హైదరాబాద్‌లో అత్యధికంగా 23.45 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఆ తర్వాత జనగామ జిల్లాలో 22.34 మహబూబాబాద్‌లో 21.89 కామారెడ్డిలో 20.49 భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 19.98 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డయింది. అతి తక్కువగా నల్గొండ జిల్లాలో 6.95 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. వేసవి లో వానలు పడుతుండడంతో ఉష్ణోగ్రతలు చాలా వరకు పడిపోయాయి. నిన్నటిదాకా 45 డిగ్రీలుగా రికార్డయిన టెంపరేచర్లు.. సడన్‌గా 43 – 40 డిగ్రీలకు తగ్గిపోయాయి. ఈ ఏడాది ఎండాకాలంలో కూడా కుంభవృష్టి కురిసింది. ఏప్రిల్, మే నెలల్లో కురిసిన వర్షాలు వర్షపాతం రికార్డులను మార్చేశాయి. 40 ఏళ్ల తర్వాత వేసవిలో ఈ ఏడాది అత్యంత ఎక్కువగా వర్షపాతం గా రికార్డుకెక్కింది. వేసవిలో పంట చేతికొచ్చింది ఆనంద పడ్డ రైతుకు వాన గండం పట్టుకుంది రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ మార్కెట్ యార్డు ల్లో వరిధాన్యం తడిసి నీళ్లల్లో కొట్టుకుపోతున్న దృశ్యాలు గుండె తరుక్కుపోయేలా చేస్తున్నాయి. మామూలుగా అయితే, ఈ సమయంలో నీటి చుక్క కరవై జనం విలవిలాడుతూ ఉండేవారు. ఇప్పుడు అన్ని ప్రాంతాల్లో వద్దంటే నీరు ప్రవహిస్తోంది. చాలా చోట్ల చెక్‌డ్యామ్‌లు కూలిపోయాయి. రహదారులన్నీ కాలువలైపోయాయి. .హైదరాబాద్ వంటి మహా నగరంలోనే ఇక్కట్లు తప్పలేదంటే ఇక గ్రామాలు, పట్టణాల్లో పరిస్థితి ఎలా ఉందో ఊహించవచ్చు.
ఎండాకాలంలో ఎక్కువగా నడిచే బిజినెస్ కూలర్లు,ఏసీలు వేసవి వచ్చిందంటే చాలు ఈబిజినెస్ పుంజుకుంటుంది. కానీ ఈసారి తగ్గిపోయింది. ఎండలు తగ్గిపోవడంతో ఏసీలకు డిమాండ్ పడిపోతోంది. ఈ ఏడాది ఏప్రిల్‌లో ఏసీల అమ్మకాలు 15 శాతం తగ్గాయని ఇండస్ట్రీ వర్గాలు పేర్కొన్నాయి. ఏప్రిల్ నెల చివరిలో, మే ప్రారంభంలో అకాల వర్షాలు పడడంతో ఏసీలు, రిఫ్రిజిరేటర్లు, కూలర్లకు డిమాండ్ తగ్గిపోయింది. కిందటేడాది ఏప్రిల్‌తో పోలిస్తే తక్కువ అమ్మకాలు జరిగాయి. చాలా మంది కస్టమర్లు ఈ వేసవిలో ఏసీల వాడకాన్ని తగ్గించేసారు. మే నెలలో హీట్‌వేవ్స్ వస్తాయని, సమ్మర్ సీజన్ ఎక్కువ కాలం కొనసాగుతుందనే అంచనాలు ఉన్నాయని వ్యాపారాలు అనుకున్నారు. కానీ అంచనాలు తారుమారయ్యాయి. ఎండవేడిమి లేక కోల్డ్ వేవ్ ఉండడంతో ఒక్కఏసీ కూలర్ల బిజినెస్ మాత్రమే కాదు ఇతర బిజినెస్ లు కూడా దెబ్బతిన్నాయి. కొబ్బరిబొండాలకు గిరాకి లేదు..జ్యూస్ షాపుల వద్ద కస్టమర్లు లేక వెలవెలబోతున్నాయి. కూల్ డ్రింక్స్ షాపులు, ప్రత్యేకించి సమ్మర్ కోసమే కొన్ని షాపులు తెరుచుకుంటాయి ఆయా బిజినెస్ కి ఈ వర్షాలు దెబ్బేసాయని అంటున్నారు.
రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. గత 15 రోజులుగా ఎడతెరిపిలేకుండా వర్షాలు కురిసాయి. మధ్యలో రెండుమూడు రోజులు ఎండలు దంచి కొట్టిన మళ్ళీ వర్షాలు పడుతున్నాయి. వేసవిలో వర్షాలేంటని అందరు ఆశ్చర్య పోతున్నారు. మరికొన్ని రోజులు ఇదే పరిస్తితి కొనసాగవచ్చని వాతావరణ నిపుణులు ఇప్పటికే హెచ్చరించారు. సాధారణ వర్షాలతో పాటు ఇప్పుడు మరోవిధమైన పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. అలాగే ఋతుపవనాలుకూడా మరో రెండు మూడు రోజుల్లో తెలుగు రాష్టాలను తాకనున్నాయి. రాగల మూడు రోజుల్లో తూర్పు దక్షిణ పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులు గంటకు 50కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. దక్షిణ ద్రోణి విదర్భ నుండి తెలంగాణ, రాయలసీమ ప్రాంతాల మీదుగా దక్షిణ తమిళనాడు వరకూ సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోంది. దీని ప్రభావంతో రాగల మూడు రోజులు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉన్నట్టు వాతవారణ కేంద్రం తెలిపింది. హైదరాబాద్‌తోపాటు చుట్టు పక్కల జిల్లాల్లో పగటి ఉష్ణోగ్రతలు 38నుంచి 41డిగ్రీల వరకూ నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వెల్లడించింది. వేసవిలో ఇటువంటి వాతావరణాన్ని మునుపెన్నడూ చూడలేదని పెద్దవారంటున్నారు. దాదాపుగా నలభై ఏళ్ల తరువాత మళ్ళీ ఇటువంటి పరిస్థితులను చూస్తున్నామని మరికొందరంటున్నారు