కేంద్ర ఎన్నికల సంఘం జనసేన ( Janasena) పార్టీకి గుడ్ న్యూస్ చెప్పింది. గ్లాస్ గుర్తు(glass symbol)ను తిరిగి జనసేన పార్టీకే సీఈసీ కేటాయించింది.
Janasena : కేంద్ర ఎన్నికల సంఘం జనసేన ( Janasena) పార్టీకి గుడ్ న్యూస్ చెప్పింది. గ్లాస్ గుర్తు(glass symbol)ను తిరిగి జనసేన పార్టీకే సీఈసీ కేటాయించింది. దీంతో తమ పార్టీకి ఎన్నికల గుర్తుగా మరోసారి గ్లాస్‌ను కేటాయించినందుకు ..కేంద్ర ఎన్నికల సంఘానికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు అని పేర్కొంటూ జనసేన (Janasena)పార్టీ ప్రకటన విడుదల చేసింది.
గత సార్వత్రిక ఎన్నికల్లో ఏపీ తెలంగాణలో జనసేన అభ్యర్థులు గ్లాస్ గుర్తు పైనే పోటీ చేశారు. అప్పుడు ఏపీలో 137 స్థానాలతో పాటు, తెలంగాణ నుంచి 7 లోక్‌సభ స్థానాలలో జనసేన పార్టీ అభ్యర్థులు గ్లాస్ గుర్తుతోనే బరిలోకి దిగారు.
మరికొద్ది నెలల్లో రాబోతున్న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో జనసేన మరోసారి పోటీకి సిద్ధమవుతోంది.దీంతో రిజిస్టర్డ్ పార్టీ అయిన జనసేన( Janasena)కు..మళ్లీ గ్లాస్ గుర్తును కేటాయిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయంపై ఆ పార్టీ నేతలు హర్షం వ్యక్తం చేశారు. తమ పార్టీ తరఫున ఈసీకి కృతజ్ఞతలు తెలిపారు.
కొంతకాలం కిందట జనసేన(Janasena) గాజు గ్లాస్ గుర్తును కేంద్ర ఎన్నికల సంఘం రద్దు చేసింది. దీంతో ఇక పార్టీకి ఆ గుర్తు ఉండబోదంటూ ప్రచారం కూడా జరిగింది. వైసీపీ నేతలు కూడా చాలాసార్లు పార్టీకి గుర్తు సంపాదించుకోలేనివాడు ఏపీని పాలిస్తాడట అంటూ తరచూ సెటైర్లు వేసేవాళ్లు. అయితే ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం జనసేన పార్టీకి అదే గ్లాసు గుర్తును కేటాయించడంతో.. అందరి మాటలకు చెక్ పెట్టినట్లు అయింది.