తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌పై భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి మరోసారి స్పందించారు. స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం (The Skill Development Scam)కేసులో సీఐడీ అధికారుల (CID officials) వ్యవహారం..తనకు చాలా అనుమానాలకు తావిస్తోందని పురంధేశ్వరి అన్నారు.
Purandheswari : తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌పై భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి మరోసారి స్పందించారు. స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం (The Skill Development Scam)కేసులో సీఐడీ అధికారుల (CID officials) వ్యవహారం..తనకు చాలా అనుమానాలకు తావిస్తోందని పురంధేశ్వరి అన్నారు. ఈ రోజు చంద్రబాబు(Chandrababu) కేసు గురించి మళ్లీ ప్రస్తావించిన ఆమె.. స్కిల్ డెవలప్మెంట్తో పాటు , అవసరమైన సౌకర్యాలు స్కిల్ కేంద్రాల్లో కల్పించినట్లుగా తమ పరిశీలనలో ఉందని తెలిపారు.
స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం కేసు విచారణలో భాగంగా .. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న ఏ ఒక్క స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అధికారైనా ఇప్పుడు స్పందించారా అని పురంధేశ్వరి ప్రశ్నించారు. అందువల్లే చంద్రబాబు(Chandrababu)ను ఏపీ గవర్నమెంట్ అరెస్ట్ చేసిన తీరుపై తాము మరోసారి ప్రశ్నిస్తున్నామని అన్నారు.
మరోవైపు స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం(The Skill Development Scam) కేసులో.. రాజమండ్రి జైలులో రిమాండ్ ఖైదీగా చంద్రబాబు ఉన్నారు. అటు చంద్రబాబు బెయిల్, మధ్యంతర బెయిల్ పిటిషన్లపై ఏసీబీ కోర్టులో విచారణ కొనసాగుతూనే ఉంది. దీనిపై రేపు అంటే మంగళవారం కోర్టులో మరోసారి విచారణ జరగనుంది.
అయితే చంద్రబాబు అరెస్ట్ వెనుక బీజేపీ పెద్దలున్నారని చాలామంది నేతలు ఆరోపిస్తుంటుంటే స్వయానా ఆ బీజేపీ నేతే ఇలాంటి సమయంలో చంద్రబాబు అరెస్ట్‌పై వ్యతిరేకంగా మాట్లాడటం చర్చనీయాంశం అయింది. చంద్రబాబు కేసులో..బంధుత్వంతో ఇప్పుడు మాట్లాడినా రేపు ఢిల్లీ పెద్దలు పురంధేశ్వరి నోరు నొక్కడం ఖాయమనే కామెంట్లు వినిపిస్తున్నాయి.