Temple Online Seva Stopped: రాష్ట్రంలో నిలిచిపోయిన ఆన్‌లైన్ సేవలు… ఇబ్బందుల్లో భక్తులు
Temple Online Seva Stopped: ఆంధ్రప్రదేశ్ దేవాలయాల్లో ఆన్‌లైన్ సర్వీసులు నిలిచిపోయాయి. ఆన్‌లైన్ సేవలు నిలిచిపోవడంతో సేవలకు సంబంధించి భక్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆన్‌లైన్ టిక్కెటింగ్, ఇతర సేవలు, ఇ హుండీ వంటి ఇతర సేవలు నిలిచిపోయాయి. 175 దేవాలయాల్లో ఆన్‌లైన్ సర్వీసులు నిలిచిపోవడంతో భక్తులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భక్తులతో పాటు అటు దేవాదాయ శాఖ కూడా ఆదాయన్ని కోల్పోవలసి వచ్చింది. గతంలో ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ సర్వీసెస్ సంస్థ ఆన్‌లైన్ సర్వీసెస్‌ను అందిస్తూ వచ్చింది. అయితే, జగన్ ప్రభుత్వం వచ్చిన తరువాత సేవలు పొందినందులు నిధులు చెల్లించాలని ఏపీటీఎస్ దేవాదాయ శాఖను కోరింది. రూ. 9కోట్ల చెల్లింపులు చెల్లించాలని కోరింది.
కానీ, దేవాదాయ శాఖనుండి ఎలాంటి స్పందన లేకపోవడంతో సర్వీసులను నిలిపివేసింది. దీంతో దేవాదాయశాఖాధికారులు ఏపీటీఎస్ కు లేఖ రాశారు. కొత్త సాఫ్ట్‌వేర్ కంపెనీ సర్వీసులు అందించే వరకు సేవలు పునరుద్దరించాలని కోరింది. దీనికి సరేనని చెప్పి ఏపీటీఎస్ సంస్థ ఈ ఏడాది జనవరి వరకే సేవలు అందిస్తామని తెలిపారు. కాగా, హైదరాబాద్‌కు చెందిన నైన్ అండ్ నైన్ కంపెనీ ఉచితంగా సాఫ్ట్‌వేర్ సేవలు అందించేందుకు ముందుకు వచ్చింది. అయితే, ఇప్పటి వరకు సాఫ్ట్‌వేర్ సిద్ధం కాలేదు. జనవరి వరకు పూర్తి చేస్తామని హామీ ఇచ్చినా పూర్తవ్వలేదు. మరోవైపు ఏపీటీఎస్ తమ సంస్థకు చెందిన ముగ్గురు ఉద్యోగులను వెనక్కి తీసుకోవడంతో ఆన్‌లైన్ సేవలు నిలిచిపోయాయి.