TDP Strategy: బలం లేకున్నా బరిలోకి టీడీపీ.. బాబు స్కెచ్ మామూలుది కాదుగా!
TDP Strategy: అసెంబ్లీ కోటా ఎమ్మెల్సీ కూడా గెలిచే అవకాశం ఉందనే మాట ఇప్పుడు ఏపీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అవుతోంది. ఇప్పటికే ఏపీలో మూడు గ్రాడ్యుయేట్ స్థానాలు దక్కించుకున్న టీడీపీ గెలుపు బాటలో కనిపిస్తోంది. ఏపీలో మూడు పట్టభద్రుల స్థానాలు గెలుచుకోవడంతో పాటు ఇప్పుడు అసెంబ్లీ కోటాలో ఒక స్థానం గెలిచే వ్యూహం రచించిందని అంటున్నారు. ఈసారి మొత్తం 7 స్థానాలకు ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతుంటే అధికార పార్టీ వైసీపీ ఏడుగురు అభ్యర్థులను ప్రకటించింది. ప్రతిపక్ష టీడీపీ కూడా చివరి నిమిషంలో వ్యూహాత్మకంగా తన అభ్యర్థి అయిన పంచుమర్తి అనురాధని రంగంలోకి దింపింది. సభలో అధికార పార్టీకి 151 (జనసేన సభ్యునితో కలిపి 152, టీడీపీ నుంచి మద్దతు ఇస్తున్న వాఋ మరో నలుగురు) మంది, ప్రతిపక్ష పార్టీకి 19 మంది సభ్యులు ఉన్నారు.
ఈ ప్రకారం చూసుకుంటే అధికార పార్టీ నుండి ఏడుగురు అభ్యర్థులకు ఒక్కొక్కరికి 21.57 మంది ప్రధమ ప్రాధాన్యత ఓట్లు వస్తే, ప్రతిపక్ష టీడీపీకి 23 మంది ప్రధమ ప్రాధాన్యత ఓట్లు వేస్తారు. (ప్రతి సభ్యుడి ఓటు విలువ లెక్క కట్టలేదు). అధికార పార్టీ తన ఏడో అభ్యర్థి విజయాన్ని వదులు కుంటే తప్ప టీడీపీకి మించిన ఓట్లు తన ఆరుగురు అభ్యర్థులకు సాధించలేదని అంటున్నారు. అయితే టీడీపీ తో విభేదించిన నలుగురు శాసనసభ్యులు పార్టీ విప్ ధిక్కరిస్తే మాత్రమే టీడీపీ ఓటమి సాధ్యం అవుతుందని విశ్లేషకుల అంచనా . (అప్పుడు టీడీపీకి 19 మంది మొదటి ప్రాధాన్యత ఓట్లు మాత్రమే వస్తాయి, ఆపైన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఓటు కూడా ఉంటుంది.
అది కలిస్తే 20 మంది ప్రధమ ప్రాధాన్యత ఓట్లుగా లెక్కిస్తారు) ఒకవేళ ఆ నలుగురు ఎమ్మెల్యేలు విప్ ధిక్కరించి అధికార పార్టీకి ఓటు వేసినా, అధికార పార్టీలోని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డితో పాటు ఇంకో ఒకరిద్దరు అసంతృప్త శాసనసభ్యులు ఓటు వేస్తే టీడీపీ గెలుపు ఆపడం సాధ్యం కాదు.అధికార పార్టీ అసంతృప్తులను, తిరుగుబాటుదారులను కట్టడి చేసుకోగలిగినా ఓ ఇద్దరు, ముగ్గురు అధికార పార్టీ శాసనసభ్యుల ఓటు చెల్లకపోతే కూడా టీడీపీ గెలుపు ఆపడం సాధ్యం కాదు. మొత్తంగా ఈ వ్యూహంతో అధికార పార్టీకి ముచ్చెమటలు పట్టిస్తున్నారు చంద్రబాబు అని అంటున్నారు.
అయితే మొదటి ప్రాధాన్యత ఓట్లు చేజారకుండా చూసుకుంటే తప్ప టీడీపీ అభ్యర్థిని ఓడించడం వైసీపీకి అంత తేలిక కాదని చెబుతున్నారు. అందుకే “పోల్ మేనేజ్మెంట్” చాలా కీలకం అని అయితే అందులో చంద్రబాబుది అందెవేసిన చేయి అని విశ్లేషకులు అంటున్నారు. ఇలాంటి వ్యూహాల్లో చంద్రబాబుకు టీడీపీ నేతలు సహకరించినంతగా జగన్ కు తన పార్టీ నేతలు సహకరించడం లేదు అనేది ఇప్పటికే స్పష్టం అయిందని, అలా సహకరించని దాని ఫలితమే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ విజయం, వైసీపీ పరాజయం అని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ అంశం మీద మీ ఉద్దేశం ఏమిటో కింద కామెంట్ చేయండి.