TDP Shock: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ.. ఆ షాక్ ఇచ్చేందుకేనా?
TDP Shock: ఏపీలో ఇప్పటికే ఎమ్మెల్యే కూడా ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడింది. ఎమ్మెల్యే కోటాలో మొత్తం ఏడు ఎమ్మెల్సీ స్థానాలకు ఖాళీలు ఉండడంతో ఆ స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. దీనికి సంబంధించి మార్చి ఆరవ తేదీన నోటిఫికేషన్ విడుదల కాగా నోటిఫికేషన్ ప్రకారం మార్చి 13వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. మార్చి 14వ తేదీన నామినేషన్లను పరిశీలించి 16వ తేదీ నామినేషన్ లో ఉపసంహరణకు తుది గడువు ఇచ్చారు. చివరికి బరిలో నిలిచిన అభ్యర్థులందరూ మార్చి 23వ తేదీన పోటీ పడబోతున్నారు. అదే రోజున పోలింగ్ కూడా జరగబోతోంది ఇక పోలింగ్ జరిగిన రోజు సాయంత్రానికి ఫలితాలు కూడా వెల్లడించే అవకాశం కనిపిస్తోంది.
ఇక ప్రస్తుతానికి వైసీపీ ఎమ్మెల్యేల బలం చూసుకుంటే ఖాళీగా ఉన్న ఏడు ఎమ్మెల్సీ స్థానాలను వైసీపీ గెలుచుకోవడం ఖాయమే. ఎందుకంటే ఆ పార్టీకి 151 మంది ఎమ్మెల్యేల అధికారిక బలం ఉంటే టిడిపికి చెందిన నలుగురు అంటే వల్లభనేని వంశీ, వాసుపల్లి గణేష్ కుమార్, కరణం బలరాం, మద్దాలి గిరి, వైసీపీకి బయటి నుంచి మద్దతు ఇస్తున్న క్రమంలో ఆ నలుగురు మినహాయించి టిడిపికి 19 సభ్యులు బలం ఉంటుంది. అయితే ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలవగల పరిస్థితుల్లో లేకపోయినా అభ్యర్థిని దించే యోచనలో టిడిపి ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు టిడిపి హై కమాండ్ ముందు కొంతమంది ఎమ్మెల్యేలు ఈ మేరకు ప్రతిపాదనలు పెట్టినట్లుగా టాక్ వినిపిస్తోంది.
ఈ మేరకు చంద్రబాబుతో కూడా భేటీ అయ్యారని అంటున్నారు. అసలు విషయం ఏమిటంటే ఖాళీ అవుతున్న ఏడుగురులో టిడిపికి చెందిన నారా లోకేష్, దివంగత బచ్చుల అర్జునుడు వైసీపీకి చెందిన భగీరథరెడ్డి, పోతుల సునీత, డొక్కా వరప్రసాద్, పెనుమత్స సూర్యనారాయణ రాజు, గంగుల ప్రభాకర్ రెడ్డి వంటి వారి పదవీకాలం ముగియబోతుంది. ఈ ఏడు స్థానాలకి ఈసీ షెడ్యూల్ ప్రకటించింది. వీరిలో చల్లా భగీరథ రెడ్డి, అర్జునుడు ఇప్పటికే మృతి చెందారు వైసీపీ తరఫున పోతుల సునీత, పెనుమత్స సూర్యనారాయణ రాజు, కోలా గురువులు, మర్రి రాజశేఖర్ , ఇజ్రాయిల్, చంద్రగిరి ఏసురత్నం, జై మంగళ వెంకటరమణ అభ్యర్థులుగా బరిలోకి దిగారు.
అయితే ఈసారి టిడిపి ఒక అభ్యర్థిని బరిలోకి దించే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే అలా అభ్యర్థిని బరిలోకి దింపి ఓటు తమకే వేయాల్సిందిగా టిడిపి తరఫున గెలిచిన ఎమ్మెల్యేలందరికి ఒక విప్ జారీ చేసే అవకాశం ఉందని అంటున్నారు. ఆ విప్ ప్రకారం ఓటు వేయని అభ్యర్థులను అనర్హులుగా ప్రకటించమని స్పీకర్ ను తెలుగుదేశం పార్టీ కోరే అవకాశాన్ని కనిపిస్తోంది. విప్ పాటించని నేపథ్యంలో షోకాజ్ నోటీసులు జారీ చేయడం దాని తర్వాత అనర్హులుగా ప్రకటించే ప్రక్రియతో నలుగురు ఎమ్మెల్యేలకు షాక్ ఇచ్చే ప్రయత్నం టిడిపి ఏమైనా చేస్తోంది ఏమో అనే ప్రచారం జరుగుతోంది. అయితే స్పీకర్ కూడా అధికార పక్షానికి చెందిన వారే ఉంటారు కాబట్టి దాని వల్ల పెద్దగా ఉపయోగం లేదు, కానీ ప్రజల్లో వారిని టార్గెట్ చేయడానికి ఈ పని చేసినా ఆశ్చర్యం లేదని అంటున్నారు.