TDP Whip: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలపై టీడీపీ విప్ జారీ
TDP Whip: ఇప్పటికే రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలను దక్కించుకున్న టీడీపీ మూడో స్థానం విషయంలో కూడా ముందంజలో ఉంది. ఈ క్రమంలో జోష్ లో ఉన్న టీడీపీ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలపై విప్ జారీ చేసింది. ఈ నెల 23వ తేదీన జరగనున్న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలపై ఎమ్మెల్యేలకు టీడీపీ విప్ జారీ చేయడం హాట్ టాపిక్ అయింది. ప్రస్తుతానికి బయటి నుంచి జగన్ కు మద్దతు ఇస్తున్న వల్లభనేని వంశీ, వాసుపల్లి గణేష్, కారణం బలరాం, మద్దాలి గిరి సహా 23 మంది పార్టీ ఎమ్మెల్యేలకు విప్ జారీ చేశారు. ఈ మేరకు టీడీపీ ఎమ్మెల్యే, విప్ డోల శ్రీ బాల వీరాంజనేయ స్వామి వారందరికీ విప్ జారీ చేశారు. విప్ ను ఆయా ఎమ్మెల్యేలకు స్పీడ్ పోస్టులో పంపిడంతో పాటు వ్యక్తిగతంగా కూడా టీడీపీ అందజేసినట్టు తెలుస్తోంది. 23వ తేదీన జరిగే ఎన్నికల్లో పాల్గొని తెలుగు దేశం పార్టీ అభ్యర్థి పంచుమర్తి అనురాధకు ఓటు వేయాల్సిందిగా ఆదేశించారు. అయితే టీడీపీకి సరైన బలం లేకున్నా పార్టీ నుంచి బయటకు వెళ్లి పార్టీ మీద ఆరోపణలు చేస్తున్న వారికి షాక్ ఇచ్చేందుకే ఇలా చేస్తున్నారని అంటున్నారు.