TDP Focus: సర్వేలు చూసి సంబరపడ్డం కాదు.. ఈ సీట్లు మీద ఫోకస్ పెట్టాల్సిందే!
TDP Focus: ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు వచ్చే ఏడాది ఏప్రిల్ నెలలో జరగబోతున్నాయి. అంటే దాదాపుగా 13 నెలల సమయం ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే అన్ని పార్టీలు మరొక నెల రోజుల్లోనే ఎన్నికలు జరుగుతున్నాయా అనే అంతలో హోరాహోరీ ప్రచారం చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. దాదాపుగా అన్ని పార్టీలు విజయం తమవే అనుకుంటూ బరిలోకి దిగాయి. ఈ మధ్యకాలం వరకు వైసిపి మరోసారి కచ్చితంగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని, అంచనాలు ఉండగా జనసేన, టీడీపీ పొత్తు పెట్టుకునే అవకాశాలు ఉన్నాయని వార్తలు తెర మీదకు రావడంతో ఇప్పుడు వైసీపీ విజయ అవకాశాలకు కూడా ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయి. తాజాగా వివిధ సంస్థల సర్వేలు సైతం ఏపీలో విడుదలయ్యాయి అలా విడుదలైన సంస్థల సర్వేల ఫలితాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ, జనసేన కొత్తవి పెట్టుకుని పోటీ చేస్తే టీడీపీ, జనసేన కూటమి కచ్చితంగా అధికారంలోకి రావడం ఖాయమని అంటున్నారు.
ముఖ్యంగా 2019 ఎన్నికల ఫలితాలను ముందుగా ఊహించడమే కాదు కరెక్ట్ గా లెక్కలు వేసి చెప్పిన ఆత్మసాక్షి అనే సర్వే సంస్థ వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధికారానికి దూరమవుతుందని తాజాగా సర్వే రిలీజ్ చేసి బాంబు పేల్చింది. టిడిపి అధికారానికి దగ్గరవుతోందని వైసీపీ కేవలం 68 సీట్ల దగ్గర ఆగిపోతుందని ఆత్మసాక్షి సర్వే తేల్చి చెప్పింది. అయితే ఈ సర్వే ప్రకారం టిడిపి అధికారంలోకి దగ్గరలో ఉన్నది అని చెప్పినంత మాత్రాన సంబర పడాల్సిన అవసరం లేదని, ఎందుకంటే అధికారంలోకి రావడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ కంటే కాస్త దూరంగానే టిడిపి సీట్లు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది సమయం కూడా ఎక్కడా రెస్ట్ తీసుకోకుండా టీడీపీ శ్రేణులు సహా చంద్రబాబు సైతం పూర్తి స్థాయిలో కష్టపడాలని అంచనాలు వెలువడుతున్నాయి.
ముఖ్యంగా వైసీపీకి కంచుకోటలుగా చెబుతున్న కొన్ని నియోజకవర్గాలు అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ రిజర్వ్ నియోజకవర్గాలు ఇలా అన్నింటి మీద దృష్టి పెట్టాలని అంటున్నారు. మొత్తం మీద 29 ఎస్సీ రిజర్వ్, 7 ఎస్టీ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీ చేస్తారు. 2019 ఎన్నికల్లో ఈ 36 రిసర్వ్ సీట్లలో దాదాపు 34 సీట్లను వైసీపీ తన ఖాతాలో వేసుకుంటే టిడిపి ఒకే ఒక్క సీటుకు పరిమితమైంది, జనసేన నుంచి ఒక ఎమ్మెల్యే గెలిచారు. 2019 ఎన్నికల్లో 29 ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గాలు ఉంటే అందులో 27 స్థానాలను వైసీపీ గెలుచుకుంటే కేవలం రెండే స్థానాలను ఇతరులు పంచుకున్నారు.
ఇక తాజా లెక్కల ప్రకారం ఈసారి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలంటే ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాల సీట్లతో పాటు గత రెండు పర్యాయాలు తాము ఓడిపోయిన సీట్ల పైన కూడా పెద్ద ఎత్తున దృష్టి పెట్టి వాటిని దక్కించుకునే ప్రయత్నం చేయాల్సి ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు. ముఖ్యంగా గ్రేటర్ రాయలసీమ 62 సీట్ల పైన గట్టిగా ఫోకస్ చేయకపోతే తెలుగుదేశం పార్టీకి ఈసారి కూడా ఆశాభంగం తప్పదనే వాదనలు వినిపిస్తున్నాయి. చూడాలి మరి ఏం జరగబోతుంది అనేది.