తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తున్న మహానాడు కార్యక్రమం ఘనంగా ప్రారంభం అయింది. తెలుగు రాష్ట్రాల నుంచి వేలాది మంది ప్రజలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. నాయకులు చేస్తున్న ప్రసంగాలను జాగ్రత్తగా వింటున్నారు. సీఎం జగన్పై విమర్శలు చేస్తున్న సమయంలో చప్పట్లతో ఉత్సాహపరుస్తున్నారు.
TDP Mahanadu started very grandly
తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తున్న మహానాడు కార్యక్రమం ఘనంగా ప్రారంభం అయింది. తెలుగు రాష్ట్రాల నుంచి వేలాది మంది ప్రజలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. నాయకులు చేస్తున్న ప్రసంగాలను జాగ్రత్తగా వింటున్నారు. సీఎం జగన్పై విమర్శలు చేస్తున్న సమయంలో చప్పట్లతో ఉత్సాహపరుస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నలుగురు రెడ్ల చేతిలో నాశనం అయిపోతాఉందని కాల్వ శ్రీనివాసులు ఆవేదన వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డికి అటువైపు ఇటువైపు సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయిరెడ్డి ఉంటారని, ఆ తర్వాత వైవీ సుబ్బారెడ్డి వెనకే ఉంటారని , వీళ్లంతా రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారని కాల్వ శ్రీనివాసులు ఆవేదన వ్యక్తం చేశారు.
రైతు ఆత్మహత్యల్లో ఏపీ మూడో స్థానంలో ఉందని చంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. అదే విధంగా అప్పులు చేయడంలో ఏపీ మొదటి స్థానంలో ఉందని చంద్రబాబు నాయుడు తెలిపారు. విదేశీ పెట్టుబడులను ఆకర్షించడంలో ఏపీ 14వ స్థానంలో ఉందని చంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు.
ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సైకిల్ సిద్ధంగా ఉందని చంద్రబాబు నాయుడు అన్నారు. కార్యకర్తలు, నేతలు అందరూ కలిసికట్టుగా పనిచేయాలని చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. రేపు తొలి విడత మేనిఫెస్టోను ప్రకటిస్తామని చంద్రబాబు మహానాడు వేదికపై నుంచి ప్రకటించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం పెట్టుబడులు లేవని.. జాబ్ క్యాలెండర్ లేదని విమర్శలు గుప్పించిన చంద్రబాబు, నిరుద్యోగులకు దిక్కు తోచడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.. లేని దిశా చట్టాన్ని అమలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ప్రత్యేక హోదా కోసం మెడలు వంచుతానని చెప్పన జగన్, ప్రస్తుతం పీఎం మోడీకి సాష్టాంగం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. మద్యపాన నిషేధం పెడతానన్న పెద్ద మనిషి మద్య ఆదాయాన్నే తాకట్టు పెట్టారని విమర్శించారు. 0.2 శాతం మేర మాత్రమే సాఫ్ట్ వేర్ ఎగుమతులు జరుగుతున్నాయని, అన్ని రంగాల్లోనూ ఏపీ వెనుకడుగులోనే ఉందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.
టీడీపీ విజన్ ఏంటో హైదరాబాద్ చూస్తే తెలుస్తుందని చంద్రబాబు నాయుడు అన్నారు. ఇరిగేషనుకు రూ.64 వేల కోట్లు ఖర్చు పెట్టామని చంద్రబాబు తెలిపారు. నాలుగేళ్ల క్రితం కొత్తగా వచ్చిన జగన్ మోహన్ రెడ్డి అన్ని వ్యవస్థలను నాశనం చేశారని, ప్రపంచ చరిత్రలో ఎక్కడా రాజధాని లేని రాష్ట్రం లేదన్నారు. పోలవరాన్ని గోదావరిలో కలిపేశారని, రాష్ట్రంలో రోడ్లు ఆధ్వాన్నంగా మారాయని విమర్శించారు. ప్రభుత్వ స్పాన్సర్స్ టెర్రరిజం పెరిగిందని చంద్రబాబు మండిపడ్డారు.
తెలుగుదేశం పార్టీకి సంక్షేమ పథకాలు అమలు చేయడం తెలుసని, అదే విధంగా సంపద సృష్టి కూడా చేయడం తెలుసని చంద్రబాబు నాయుడు అన్నారు. అనేక సంక్షేమ కార్యక్రమాలు మొదలు పెట్టింది టీడీపీయేనని అన్నారు. పేదలకు ఫించన్లివ్వడం మొదలు పెట్టింది కూడా టీడీపీనే అన్నారు.
రావణాసురుడు సాధువు రూపంలో వచ్చి సీతను ఎత్తుకెళ్లినట్టు.. ఒక్క ఛాన్స్ అంటూ జగన్ ఓట్లేయించుకున్నారని చంద్రబాబు నాయుడు విమర్శించారు. రూ 2 వేల నోట్లన్నీ జగన్ దగ్గరే ఉన్నాయని, పెద్ద నోట్ల రద్దుకు తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉందని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.
వైసీపీ అధికారంలోకి వచ్చిన నాలుగేళ్లల్లో రూ. 2.47 కోట్ల అవినీతి జరిగిందని చంద్రబాబు ఆరోపించారు. ఏపీలో సంపద దోపిడీ ఎక్కువ.. ధరల బాదుడు ఎక్కువని చంద్రబాబు విమర్శించారు. స్కాముల్లో జగన్ మాస్టర్ మైండ్ అని, సీఎం నోరు తెరిస్తే అన్నీ అబద్దాలేని, కోడికత్తి డ్రామా.. మద్య నిషేధం వంటివన్నీ డ్రామాలేనని ఎద్దేవా చేశారు.
తెలుగుజాతి చరిత్ర తిరగరాసే రోజు వస్తుందని, రాష్ట్రాన్ని కాపాడాలని అందరూ సంకల్పం తీసుకోవాలని చంద్రబాబు పిలుపిచ్చారు. దేశంలో తెలుగుజాతిని అగ్రస్థానంలో నిలబెట్టాలని, సహకరిస్తే సరే.. అడ్డొస్తే తొక్కుకుంటూ పోతామని చంద్రబాబు అన్నారు. కార్యకర్తల త్యాగాలు తాను మర్చిపోనని, ఏ కష్టం వచ్చినా అండగా ఉంటానని చంద్రబాబు అభయమిచ్చారు. పేదలను ధనికులుగా మార్చే బాధ్యత తెలుగుదేశం పార్టీదేనని చంద్రబాబు అన్నారు.
తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మహానాడు వేడుకలు రాజమండ్రిలో ఘనంగా ప్రారంభం అయ్యాయి. ఈ కార్యక్రమంలో టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. క్రీస్తు శకం మాదిరిగా ఎన్టీఆర్ శకం ప్రారంభమవుతుందని, తెలుగుజాతి ఆత్మగౌరవాన్ని ఎన్టీఆర్ ప్రపంచానికి చాటి చెప్పారని చంద్రబాబు గుర్తుచేశారు. . ఎన్టీఆర్ వారసత్వాన్ని భావితరాలకు అందించాల్సి ఉందని చంద్రబాబు అన్నారు.