టీడీపీ నేతలు తాడిపత్రి అభివృద్ధిని చూసి ఓర్వలేక పోతున్నారు..
టీడీపీ నేతలు జేసీ బ్రదర్స్‌పై వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో జరుగుతున్న తాడిపత్రి అభివృద్ధిని చూసి ఓర్వలేకే తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్నారు. 35 సంవత్సరాలు అధికారంలో ఉన్న జేసీ సోదరులు తాడిపత్రిలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేదన్నారు. జేసి బ్రదర్స్ అక్రమ మైనింగ్ చేసుకుంటూ పోయారే తప్పా నగరాన్ని పట్టించుకోలేదని మండిపడ్డారు.
ప్రభుత్వానికి వ్యతిరేకంగా జేసి ప్రభాకర్ రెడ్డి ఎప్పుడూ ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటాడని విమర్శించారు. రాష్ట్రానికి జగన్ మోహన్ రెడ్డి సీఎం అయ్యాక తాడిపత్రికి అధికంగా నిధులు వచ్చాయన్నారు. అభివృద్ధి పనులు వేగవంతమయ్యాయన్నారు. ప్రశాంతంగా ఉన్న గ్రామాలలో జేసీ ప్రభాకర్ రెడ్డి విధ్వంసాలు సృష్టించాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడిపత్రిలో అక్రమంగా నిర్మించిన కట్టడాల లీస్ట్ తయారు చేస్తే.. జేసీ ప్రభాకర్ రెడ్డితో కలిసి కూల్చడానికి తాను సిద్ధమని కేతిరెడ్డి పేర్కొన్నారు.