Nara Lokesh: సందిగ్ధం లో లోకేష్ పాదయాత్ర
Nara Lokesh: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్ర సందిగ్ధంలో పడింది. లోకేష్ యాత్రకు అనుమతి కోరుతూ డీజీపీకి ఆ పార్టీ నేత వర్ల రామయ్య లేఖ రాసారు. దీని పైన స్పందించిన డీజీపీ లేఖ పంపారు. యాత్రకు సంబంధించిన వివరాలు కోరారు. పూర్తి సమాచారం అందించాలని సూచించారు. యువగళం యాత్రకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ఇప్పటికే చాల లేఖలు రాసినా ఇప్పటి వరకూ అనుమతి రాలేదని పార్టీ నేతలు అంటున్నారు. పోలీసులు అనుమతి ఇచ్చినా.. ఇవ్వకపోయినా యువగళం పాదయాత్ర జరిగి తీరుతుందని స్పష్టం చేస్తున్నారు తెలుగు తమ్ముళ్లు.
ఈ క్రమంలో నారా లోకేశ్ కామెంట్స్ చేశారు. మూడేళ్ళుగా అవినీతి ప్రభుత్వం పై పోరాడుతున్నామని తెలుగుదేశం పార్టీకి అధికారం ప్రతిపక్షం కొత్త కాదని అన్నారు. గతంలో ఎప్పుడూ ఇలాంటి సైకో పాలన చూడలేదని ఫైర్ అయ్యారు. సైకో పాలన పోయి సైకిల్ పాలనా రావాలని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. పోలీసులు ప్రజలకు అండగా ఉండాలి కానీ పాలకులకు తొత్తులుగా మారారని అన్నారు. గతంలో జగన్ పాదయాత్ర ఎవరిని అడిగి చేసారని ఇప్పుడు మమ్మల్ని ఇంతలా సమాచారం అడగడమేంటని ఆగ్రహం వ్యక్తం చేసాడు.
ఇక డీజీపీ టీడీపీ కార్యాలయానికి లేఖ పంపారు ఈ నెల 22వ తేదీ (ఈరోజు) వ్యక్తిగతంగా కానీ లేదా లేఖ ద్వారా కానీ డీజీపీ కార్యాలయంలో ఈ వివరాలన్నీ అందజేయాలి. ఆతరువాతే తదుపరి నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేసారు. డీజీపీ రాసిన లేఖ అందిన వెంటనే టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య పేరుతో ప్రత్యుత్తరం పంపింది. మహాత్మా గాంధీ దండి యాత్ర, ఆచార్య వినోభా భావే దేశమంతా పాదయాత్ర చేశారు. గతంలో పాదయాత్ర చేసిన వారి వద్దనుండి పొలిసు శాఖఇన్ని ప్రశ్నలను అప్పుడు వారిని అడగలేదు. ఇప్పుడు లోకేష్ పాదయాత్రచేస్తే ఇన్ని ప్రశ్నలు అవసరమా అని ఫైర్ అయ్యారు. అనుమతి ఇచ్చినా.. ఇవ్వకపోయినా యువగళం పాదయాత్ర మాత్రం జరిగి తీరుతుందని స్పష్టం చేసారు.