Chandra Babu: టీడీపీ సీనియర్ నేత అయన్నపాత్రుడును పోలీసులు అరెస్ట్ చేసారు. గురువారం తెల్లవారుజామున అయ్యన్నపాత్రుడి ఇంటిని పోలీసులు చుట్టుముట్టారు. ఇంటి గోడ కూల్చివేత , ఫోర్జరీ పత్రాలు సమర్పించారని అయ్యన్నపై అభియోగాలున్నాయి. ఈ కేసులో మొదటి నిందితుడిగా అయ్యన్నపాత్రుడు, రెండో నిందితుడిగా విజయ్, మూడో నిందితుడిగా రాజేష్ ఉన్నారు. అయ్యన్నకు నోటీసులు అందజేసి అరెస్టు చేశారు. ఆయన కుమారుడు చింతకాయల రాజేశ్‌ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పలు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఏలూరు కోర్టులో అయ్యన్నను హాజరుపరుస్తామని పోలీసులు చెప్పారు.
కాగా సీఐడీ పోలీసుల తీరుపై అయ్యన్నపాత్రుడి సతీమణి పద్మావతి ఆగ్రహం వ్యక్తం చేశారు. తెల్లవారు జామున 3 గంటల ప్రాంతంలో దొంగల్లా గోడ దూకి వచ్చి, తలుపులు పగులగొట్టి ఇంట్లోకి వచ్చేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. తన భర్త, కుమారుడికి ప్రాణహాని ఉందన్నారు. వారికి ఏదైన జరిగితే అందుకు ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు.
అయ్యన్న పాత్రుడిని అరెస్ట్ ను తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్రంగా ఖండించారు. జగన్ ముఖ్యమంత్రిలా కాకుండా రాక్షసుడిలా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గోడలు దూకి తలుపులు బద్దలుగొట్టి మాజీ మంత్రి బీసీ నేత అయిన అయ్యన్న ను ఆయన కుమారుడిని అరెస్ట్ చేయడం తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు. జగన్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ అయ్యన్న కుటుంబాన్ని ప్రభుత్వం వేధిస్తోందన్నారు. అయ్యన్న ఇంటి గోడ కూల్చివేత మొదలు ఆయనపై 10కి పైగా కేసులు పెట్టి వేధిస్తున్నారని అన్నారు. వైసీపీ ఉత్తరాంధ్ర దోపిడీని ప్రశ్నిస్తున్న బీసీ నేతల గళాన్ని అణచివేసేందుకే కేసులు, అరెస్టులు చేస్తున్నారని మండిపడ్డారు. వెంటనే అరెస్ట్ చేసిన వారిని విడుదల చేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఒక సిఎం లా కాకుండా రాక్షసుడిలా వ్యవహరిస్తున్నాడు. గోడలు దూకి, తలుపులు పగల గొట్టి నర్సీపట్నంలో మాజీ మంత్రి, బిసి నేత అయ్యన్న పాత్రుడి ని అరెస్టు చెయ్యడం దిగ్ర్బాంతి కలిగించింది.(1/3)#WeStandWithAyyanna pic.twitter.com/R2NTLXFbGO
— N Chandrababu Naidu (@ncbn) November 3, 2022
అధికారంలో వచ్చిన నాటినుంచి అయ్యన్న కుటుంబాన్ని ప్రభుత్వం వెంటాడుతోంది…ఇప్పటికే 10కిపైగా కేసులు పెట్టారు. చింతకాయల విజయ్ పై కేసు విషయంలో సిఐడి విధానాలను కోర్టు తప్పు పట్టినా పోలీసులు మారలేదు.(2/3)
— N Chandrababu Naidu (@ncbn) November 3, 2022