రాబోయే ఎన్నికల్లో టీడీపీ(TDP),జనసేన(Jana Sena), వామపక్ష పార్టీలు(Left parties) కలిసి పని చేస్తే మంచిదని రామకృష్ణ అభిప్రాయపడ్డారు. ఈ ముగ్గురి కూటమిని ప్రజలు కూడా ఆదరిస్తారని దీమా వ్యక్తం చేశారు.
CPI Ramakrishna : ఏపీలో ఎన్నికల వేడి హీటెక్కిస్తోన్న వేళ.. పొత్తులపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ(K. Ramakrishna) కీలక వ్యాఖ్యలు చేశారు. బస్సుయాత్రలో భాగంగా పల్నాడు జిల్లాలో మాట్లాడిన ఆయన..ఇప్పటికే బీజేపీ, జనసేన పొత్తులో ఉండటంతో..బీజేపీతో కలిసి వెళ్లే పార్టీలకు వచ్చే ఎన్నికల్లో ఓటమి తప్పదంటూ హెచ్చరించారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ(TDP),జనసేన(Jana Sena), వామపక్ష పార్టీలు(Left parties) కలిసి పని చేస్తే మంచిదని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ ముగ్గురి కూటమిని ప్రజలు కూడా ఆదరిస్తారని దీమా వ్యక్తం చేశారు.
టీడీపీ(TDP), జనసేన(Jana Sena), వామపక్ష పార్టీలు (Left parties) కలిసి పోటీ చేస్తే ఏపీలో అధికారంలోకి రావడం పక్కా అని రామకృష్ణ( Ramakrishna) చెప్పుకొచ్చారు. అందుకే ఆ దిశగా పార్టీలు అడుగులు వేయాలని సూచించారు. ముఖ్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా పొత్తులపై తాను సూచించినట్లు ఆలోచిస్తే తప్పకుండా అధికారంలోకి వస్తామని చెప్పుకొచ్చారు. అలా కాకుండా బీజేపీతో టీడీపీ,జనసేన కలిస్తే జగన్ నెత్తిమీద పాలు పోసినట్లేనని రామకృష్ణ అన్నారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి(YS Jagan Mohan Reddy)కి మళ్లీ చేజేతులా అధికారాన్ని అప్పగించినట్లే అవుతుందని ఆయన చెప్పారు.
ఈ పొత్తుల వ్యవహారంలో చంద్రబాబు నాయుడు ఆలోచింది మంచి నిర్ణయం తీసుకుంటారని..తాము అనుకుంటున్నట్లు రామకృష్ణ అన్నారు. మరోవైపు ఏపీలో అరాచక పాలన కొనసాగుతుందని, ఇక్కడ అభివృద్ధి శూన్యమని… ఏ ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి కాలేదని రామకృష్ణ ఆరోపించారు. అంతేకాదు పరిశ్రమలు కూడా పక్క రాష్ట్రాలకు తరలిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ జగన్కు ప్రజలు ఒక్క ఛాన్స్ ఇస్తేనే.. ఏపీ పరిస్థితి ఇలా మారిందని.. ఇక మళ్లీ ఛాన్స్ ఇస్తే ఆంధ్రప్రదేశ్ పరిస్థితి గుండు సున్నా అవడం ఖాయమంటూ జోస్యం చెప్పారు.