TDP Plan: విభజన హామీల కోసం టీడీపీ ఎంపీల రాజీనామా?
TDP In Plan to Corner YCP and BJP With Resginations: టీడీపీ అధినేత నారా చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం నిర్వహించారు. అయితే టీడీపీ పార్లమెంట్ పార్టీ భేటీకి ముందు చంద్రబాబును ఎంపీ రఘురామకృష్ణంరాజు కలిశారు. వైఎస్ జగన్ గతంలో పార్లమెంట్ ఆఖరి రోజు అందరూ రాజీనామాలు చేసి విభజన హామీల అమలు కోసం కేంద్రం పై ఒత్తిడి చేద్దామని తెలిపారని, ఇప్పుడు ప్రత్యేక హోదా కోసం నేను రాజీనామాకు సిద్ధంగా ఉన్నా…ముగ్గురు టీడీపీ ఎంపీలను రాజీనామా కోసం ఒప్పించడానికి వచ్చానని అన్నారు. ప్రస్తుతం టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరుగుతుంది కాబట్టి నా విషయం చెప్పి బయటకు వచ్చానని ఆయన అన్నారు. ఇక విభజన హామీల కోసం టీడీపీ ఎంపీలు రాజీనామాలు చేసేందుకు సిద్ధపడుతున్నట్లు సమాచారం. వైసీపీ గత వ్యూహాన్ని టీడీపీ అమలు చేయాలనే యోచనలో టీడీపీ ఉన్నట్లు తెలుస్తోంది. ఇక శీతాకాల సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఎంపీలకు దిశా నిర్దేశం చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. ఈ సందర్భంగా ఎంపీ రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ ప్రధాని ఆహ్వానం మేరకు జి20 సన్నాహక సమావేశంలో చంద్రబాబు పాల్గొంటారన్నారు. రాష్ట్ర హక్కులు కేంద్రం నుంచి సాధించటంలో వైసీపీ విఫలం అయిందన్నారు, రాష్ట్ర ప్రయోజనాలు కేంద్రం వద్ద వైసీపీ తాకట్టు పెట్టిందన్నారు.