ఏపీ ప్రభుత్వం మీద సుప్రీం ఫైర్
స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ (SDRF) నుండి వ్యక్తిగత డిపాజిట్ ఖాతాలకు నిధులు బదిలీ నిలిపివేయాలని సుప్రీంకోర్టు బుధవారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. COVID-19 కారణంగా కుటుంబ పెద్దలను కోల్పోయిన వారి కుటుంబాలకు సహాయం చేయడానికి ఈ నిధి ఏర్పాటు చేయబడింది. విపత్తు నిర్వహణ చట్టం, 2005 కింద అందించే నిధులను వారికి సహాయం చేయడం మినహాయించి మరే ఇతర ప్రయోజనాల కోసం నిధులను మళ్లించరాదని కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. విపత్తు నిర్వహణ చట్టం, విభజన చట్టంలోని నిబంధనలు కూడా ఉల్లంఘించిన ఈ అక్రమ బదిలీపై న్యాయమూర్తులు ఎంఆర్ షా, బివి నాగరత్నతో కూడిన ధర్మాసనం తీవ్రంగా పరిగణించింది. అలా చేయడం కరెక్ట్ కాదంటూ ప్రభుత్వం మీద ఫైర్ అయింది.