SC Notices: ఉమ్మడి ఆస్తుల విభజనపై సుప్రీంకోర్టు నోటీసులు..
Supreme Court Notices to Central and Telangana: ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం 9,10 షెడ్యూల్‌లోని ఆస్తులు ఇప్పటి వరకు పంపకాలు జగరలేదని, సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం కేసులు దాఖలు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన జస్టీస్ సంజీవ్ ఖన్నా, జస్టీస్ సుందరేశ్‌తో కూడిన ధర్మాసనం విచారణ చేప్టటింది. ఏపీ ప్రభుత్వం తరపు న్యాయవాది వాదనలు విన్న సుప్రీంకోర్టు ధర్మాసనం కేంద్ర ప్రభుత్వానికి, తెలంగాణ రాష్ట్రప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఆరు వారాల్లోగా అవిడవిట్లు దాఖలు చేయాలని ఆదేశించింది. ఇక, మరో నాలుగు వారాల్లో రిజాయిండర్లను దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నిర్దేశించింది.
ఏపీ విభజన చట్టంతో పాటు, చట్టంలో పేర్కొనబడని ఉమ్మడి ఆస్తుల విభజనపై కూడా సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. విద్యుత్ సంస్థల విభజన కోసం ఏర్పాటు చేసిన జస్టీస్ ధర్మాధికారి కమిషన్ మాదిరిగానే ఇతర సంస్థల విభజన కోసం కమిషన్ వేయాలని ఏపీ ప్రభుత్వం కోరింది. పరిష్కారం లభించని పక్షంలో ఏర్పాటు చేయవచ్చని, దానికి ఇంకా సమయం ఉందని ధర్మాసనం పేర్కొన్నది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హయాంలో ఏర్పాటు చేసిన ఆస్తులు 91 శాతం మేర తెలంగాణలోనే ఉన్నాయని, విభజన చట్టంప్రకారం వీటిని విభజించాలని, లేనిపక్షంలో ఏపీ ప్రభుత్వం తీవ్రంగా నష్టపోవలసి వస్తుందని, ఇప్పటికే అనేక నష్టాలను ఎదుర్కొంటున్నామని ఏపీ ప్రభుత్వం పేర్కొన్నది.