తిరుపతిలో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య
తిరుపతిలో విద్యార్థిని ఆత్మహత్య కలకలం సృష్టించింది. నగరంలోని పద్మావతి జూనియర్ కాలేజీలో ఇంటర్ చదువుతున్న యువతి కళాశాలకు చెందిన హాస్టల్‌లోని రెండో అంతస్థులో తన రూమ్‌లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. గమనించిన సహచర విద్యార్థులు పోలీసులుకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్థానిక ఆస్పత్రికి తరలించారు.
యువతి చిత్తూరు జిల్లా కె.వి పల్లి మండలం గర్నిమిట్టకు చెందిన విష్ణు ప్రియగా గుర్తించారు. మృతురాలి తల్లిదండ్రులు కూలీ పనుల కోసం కువైట్‌కు వెళ్లినట్లు పోలీసులు తెలిపారు. విష్ణుప్రియ ప్రేమ వ్యవహారం తేలుసుకున్న తల్లిదండ్రులు యువతిని మందలించడంతో మనస్థాపంతో యువతి సూసైడ్ చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. యువతి రూమ్‌ను పరిశీలించిన పోలీసులు మృతురాలి బ్యాగ్‌లో ప్రేమ లేఖలు, గిఫ్ట్‌లను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.