Vande Bharat: వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌పై రాళ్ల దాడి
Stones pelted on Vande Bharat train in Visakhapatnam: ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో ప్రారంభం కానున్న వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌పై రాళ్ల దాడి జరగడం హాట్ టాపిక్ అయింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జనవరి 19న జెండా ఊపి వందేభారత్ రైలును ప్రారంభించాల్సి ఉంది. ఈ క్రమంలో ట్రయిల్ రన్ లో భాగంగా చెన్నై నుంచి విశాఖకు వెర్షన్ 2 వందే భారత్ వచ్చింది. విశాఖపట్నం కంచరపాలెం రామ్మూర్తి దంపతులు పేట వద్ద రైలు ఆగిన సమయంలో ఆకతాయిలు దాడి చేయడంతో ఎక్స్‌ప్రెస్ కోచ్ విండ్‌షీల్డ్ దెబ్బతిన్నట్టు తెలుస్తోంది. గమనించిన అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించి రాళ్లు విసిరిన ఆకతాయిల కోసం గాలిస్తున్నారు. ఈ రైలు సికింద్రాబాద్ – విశాఖపట్నం మధ్య నడువనున్నది.అయితే ఈ రాళ్ల దాడిని వాల్తేరు డివిజన్ అధికారులు ధ్రువీకరించారు. ఈ రైలు సికింద్రాబాద్ నుంచి బయలుదేరి.. వరంగల్, విజయవాడ, రాజమండ్రి స్టేషన్లలో ఆగుతూ విశాఖపట్నం చేరుకోనుంది.