Stone Attack on Chandrababu Convoy at Nandigama: ఎన్టీఆర్ జిల్లా నందిగామలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నందిగామలో పర్యటిస్తున్న నేపథ్యంలో చంద్రబాబు కాన్వాయిపై గుర్తు తెలియని ఒక వ్యక్తి రాయి విసిరినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆ రాయి చంద్రబాబు చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ మధుబాబుకు తగలడంతో ఆయనకు తీవ్ర గాయమైనట్లు తెలుస్తోంది.. రాయి నేరుగా వచ్చి మధుబాబు గడ్డానికి తగలడంతో తీవ్ర రక్తస్రావం జరిగినట్లుగా సమాచారం. ఈ క్రమంలో చంద్రబాబు కాన్వాయ్ లోని వైద్యులు మధుబాబుకు ప్రాథమిక చికిత్స అందించి దగ్గరలో ఉన్న హాస్పిటల్ కి తరలించారు. పోలీసుల భద్రత సరిగ్గా లేక ఈ దాడి జరిగిందని చంద్రబాబు విమర్శించారు కొన్నాళ్ల క్రితం కూడా అమరావతి ప్రాంతంలో చంద్రబాబు బస్సు యాత్ర చేపట్టిన సమయంలో బస్సుపై కూడా రాళ్లదాడి, చెప్పుల దాడి జరిగింది. అప్పట్లో ఉన్న డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ గౌతమ్ సవాంగ్ ఇది కూడా ఒక రకమైన భావ ప్రకటనా స్వేచ్ఛ అంటూ కామెంట్లు చేయడం అప్పట్లో తీవ్ర దుమారానికి దారి తీసింది.