Srisailam: శ్రీశైలంలో ఉగాది ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు సిద్ధం
Srisailam: శ్రీశైల మహాక్షేత్రంలో ఉగాది మహోత్సవాలు నేటినుండి ప్రారంభమై 23 వరకు జరగనున్నాయి. ఐదు రోజులపాటు నిర్వహించే ఉగాది మహోత్సవాలకు దేవస్థానం భక్తుల సౌకర్యార్థం విస్తృత ఏర్పాట్లు చేపట్టింది. తెలుగు రాష్టాల నుండే కాకుండా భక్తులు పక్క రాష్ట్రాల నుండి కూడా భారీగా ఈ ఉత్సవాలకు వస్తుంటారు. కావున భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా అన్ని ఏర్పాట్లను పూర్తి చేసారు.
నేటి నుంచి 23వ తేదీ వరకు ఉగాది మహోత్సవాలు నిర్వహించనున్నారు. ఇందుకోసం ఆలయ అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా రోజుకు 60- 80 వేల మంది స్వామివారి దర్శనానికి వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. కర్ణాటక, మహారాష్ట్ర నుంచి అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉందని తెలిపారు.
భక్తుల రద్ధీని దృష్టిలో ఉంచుకొని స్వామివారి అలంకరణ దర్శనం మాత్రమే కల్పించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. క్యూలైన్ల ద్వారా ఉచిత దర్శనం, శీఘ్రదర్శనం కు రూ. 200 , అతిశీఘ్ర దర్శనం కు రూ.500 గా నిర్ధారించారు. స్వామివారి గర్బాలయ, ఆర్జిత అభిషేకాలు, సామూహిక అభిషేకాలు పది రోజులపాటు తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఆలయ ఈవో వెల్లడించారు.