Srisailam Temple: శ్రీశైలంలో ఏర్పాటు కాబోతున్న మాడవీధులు
Srisailam Temple develop as like Tirumala: శ్రీశైలం అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతున్న సంగతి తెలిసిందే. నిత్యం భక్తులు పెద్ద సంఖ్యలో మల్లన్నను దర్శించుకుంటున్నారు. ప్రత్యేక పర్వదినాల్లో భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్‌లో తిరుమల తరువాత అత్యధిక భక్తులు దర్శించుకునే దేవాలయం శ్రీశైలం. ఇక, బ్రహ్మోత్సవాలను శ్రీశైలం అధికారులు పెద్ద ఎత్తున నిర్వహిస్తుంటారు. బ్రహ్మోత్సవాల సమయంలో ఉత్సవ మూర్తులను వివిధ రకాల వాహనాలపై ఊరెరిగిస్తుంటారు. అయితే, ఈ ఊరెరిగింపు కార్యక్రమం నిర్వహణ కోసం ప్రత్యేకమైన మాడ వీధులు లేకపోవడంతో అధికారులు దీనిపై దృష్టిసారించారు.
తిరుమలలో ఏ విధంగానైతే మాడవీధులు ఉన్నాయో, ఆవిధంగానే శ్రీశైలంలో కూడా మాడ వీధులను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. మాడవీధులు, క్యూలైన్లను ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీని కోసం ప్రతిపాదనలు సిద్దం చేయాలని ప్రభుత్వ సీఎస్ జవహార్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. శ్రీశైలం మాస్టర్ ప్లాన్‌పై ఇప్పటికే అధికారులతో సమీక్షను నిర్వహించారు. ఈ మోత్తాన్ని పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. దీనిపై అధికారులు పలు నిర్ణయాలు కూడా తీసుకున్నారు.