Srisailam Temple: దళారుల చేతిలో శ్రీశైలం దేవస్థానం
Srisailam Temple: శ్రీశైల స్వామి వారి గర్భాలయ అభిషేకాల ను టికెట్లు లేకుండా చేయిస్తామని దేవస్థానానికి చెల్లించాల్సిన టికెట్ల ధర తమకు అందిస్తే చాలని స్పష్టం చేస్తున్న దర్మకర్తల మండలి సభ్యురాలి ఆడీయో లీక్ తాజాగా కలకలం రేపుతోంది. వరుస వివాదాలకు శ్రీశైల పుణ్యక్షేత్రం కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తోంది. అధికారులు, పాలక మండలి సభ్యుల మధ్య అంతర్యుద్ధం తారస్థాయికి చేరిన నేపథ్యంలో తాజాగా ఆడియో ఇప్పుడు సంచలనం రేపుతోంది.
కొన్నిరోజులుగా శ్రీశైల ఆలయ అధికారుల మరియు పాలక మండలి మధ్య కోల్డ్ వార్ జరుగుతుంది. ఈ అంతర్యుద్ధం తార స్థాయికి చేరింది. ఏకంగా దర్మకర్తలమండలి చెర్మన్ లడ్డు పోర్టులో 40 లక్షలవరకు అక్రమాలు జరిగాయని ఆరోపించినా అధికారులు స్పందించడంలేదని అన్నారు. పిర్యాదు చేసిన రెండు రోజుల్లోనే తాజాగా పాలకమండలి సభ్యురాలు మాట్లాడిన ఆడియో ఇప్పుడు బయటకు రావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. గర్భాలయ అభిషేకాల ను టికెట్లు లేకుండా చేయిస్తామని టికెట్ల ధర తనకు అందిస్తే చాలని స్పష్టం చేస్తున్నఆడీయో లీక్ ఇప్పుడు కలకలం రేపుతోంది. ధర్మాన్ని పాటించాల్సిన ధర్మకర్తల మండలి సభ్యలే అధర్మానికి తెరలేపి శ్రీశైల మల్లన్న ఆదాయానికి గండికొడుతున్న వైనం పైన విమర్శలు వెల్లు వెత్తుతున్నాయి.
శ్రీశైలంలో టికెట్లు లేకుండా దర్శనాలకు తీసుకెళ్లే దళారులు ప్రోటోకాల్ పేరుతో దేవుడి సోమ్ము దోపిడీ చేస్తున్నారు. స్వామి వారి అభిషేకాలైనా, అమ్మవారి కుంకుమార్చన అయినా, ఇతర సేవ టికెట్లు లేకుండా కొందరు ధర్మకర్తల మండలి సభ్యులు పూజలు చేయిస్తూ టికెట్ల డబ్బులు తమ జేబులో వేసుకుంటున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. మరి ఈ వివాదానికి రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ ఎలాంటి చర్యలు తీసుకోనుందో చూడాలి.