Jana Sena: జనవరి 12న యూత్ డే స్పెషల్ ప్రోగ్రామ్స్
Special Programmes by Jana Sena on Youth Day on January 12
యువతకు భరోసా ఇచ్చేందుకు జనసేన ప్రాధాన్యత ఇస్తోందని జనసేన పిఎసి చైర్మెన్ నాదేండ్ల మనోహార్ అన్నారు. రాబోయే రోజుల్లో యువతకు ఉద్యోగావకాశాలకు ప్రణాళికను ప్రకటిస్తామని తెలిపారు. జాతీయ యూత్ డే సందర్భంగా జనవరి 12న శ్రీకాకుళం జిల్లా రణస్తలం లో ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నట్లు ప్రకటించారు.
మన దేశంలో యువత కోసం నిజాయితీగా ఈ ప్రభుత్వం కృషి చేయలేదని ఆరోపించారు. ఉపాధి అవకాశాలు లేకపోవడం వల్ల వలసలు పెరుగుతున్నాయని అన్నారు. జాబ్ క్యాలెండర్ పేరుతో ప్రభుత్వం మోసం చేసిందని మనోహర్ మండిపడ్డారు. జనసేన పార్టీ స్థాపన కేవలం ఎన్నికల కోసం కాదని, నిరంతరం ప్రజల కోసం పని చేస్తామని తెలిపారు. యువత ఆవేదనను జనసేన పార్టీ అర్ధం చేసుకుందని మనోహర్ తెలిపారు.
యూత్ డే నాడు అద్భుతమైన యూత్ ఫెస్టివల్ నిర్వహిస్తామని మనోహర్ తెలిపారు. యువశక్తి ప్రొగ్రాం పోస్టర్‌ను నాదేండ్ల మనోహార్ ఆవిష్కరించారు.
యువతలో రాజకీయ చైతన్యం నింపడానికే జనసేన 'యువ శక్తి'
* యువ శక్తి విజయవంతానికి ప్రత్యేక కమిటీలు
* ఉత్తరాంధ్ర నాయకులతో కలిసి యువశక్తి పోస్టర్ ఆవిష్కరణ
Link: https://t.co/6emnR8UJmP
శ్రీకాకుళం మీడియా సమావేశంలో మాట్లాడిన జనసేన పీఏసీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు pic.twitter.com/2BAvBpv3cO
— JanaSena Party (@JanaSenaParty) December 11, 2022
యువ శక్తి
మన యువత.. మన భవితభారీ బహిరంగ సభ
వేదిక: రణస్థలం,శ్రీకాకుళం జిల్లా
సమయం: జనవరి 12 , 2023 : ఉదయం 11గంటల నుండియువత సమస్యలపై గళమెత్తనున్న జనసేనాని శ్రీ @PawanKalyan గారు pic.twitter.com/nivBJic3kh
— JanaSena Party (@JanaSenaParty) December 11, 2022