టీడీపీ, వైసీపీకి సమానదూరంగా ఉంటామన్న సోము వీర్రాజు
వచ్చే నెలలో రాష్ట్రంలో ప్రధాని నరేంధ్ర మోడీ పర్యటించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు తెలిపారు. ప్రధాని పర్యటనపై రాష్ట్ర బీజేపీ నేతలతో సమాలోచనలు జరిపినట్లు సోమువీర్రాజు తెలిపారు. టీడీపీ, వైసీపీ పార్టీకి సమానదూరం పాటించాలని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. పొత్తులపై కేడర్ అయోమయంలోకి వెళ్లకుండా చూసే విధంగా పార్టీ శ్రేణులకు తెలిపినట్లు ఆయన వివరించారు. ఈ నెల చివరి వారంలో రాష్ట్రానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రానున్నట్లు తెలిపారు, నడ్డాతో పాటు అమిత్ షాను ఏపీకి తీసుకు వచ్చి భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయనున్నట్లు బీజేపీ చీఫ్ పేర్కొన్నారు.
మరోవైపు ఏపీలో గతంలో ఎన్నడూ లేని విధంగా బీజేపీ ఉంది. రాష్ట్రంలో కాంగ్రెస్ అడ్రస్ లేకుండా పోవడం, టీడీపీని ఎవరూ నమ్మె పరిస్థితి లేకపోవడంతో వైసీపీకి ప్రత్యమ్నాయం తామేనని భావించిన భారతీయ జనతా పార్టీ.. అధికార పార్టీపై దూకుడు పెంచింది. వైసీపీ చేస్తున్న తప్పులను వేలెత్తి చూపిస్తూ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వ ఆగడాలను ప్రజలకు వివరిస్తుంది. దీంతోపాటు బహిరంగ సభలను ఏర్పాటు చేసి, ఢిల్లీ పెద్దలతో సభను విజయవంతం చేసి రాష్ట్రంలో పార్టీ బలాన్ని చూపించాలని బీజేపీ చూస్తుంది.