Somu Veerraju: మాది సకల జనుల పార్టీ..అందుకే 2024లో విజయం మాదే!
Somu Veerraju: తిరుపతిలో మీడియాతో మాట్లాడిన ఏపీ బీజీపీ చీఫ్ సోమువీర్రాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో పరిస్థితి మారుతుంటాయన్న ఆయన ఏపీ బీజేపీలో ఏమి జరుగుతూంది అనేది మీరు కూడా చూస్తుండాలన్నారు. రాజకీయాలు క్రికెట్ లాంటిది, ఎప్పుడూ ఒకరే గెలవరు అని ఆయన అన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి బిజెపి చేరికకి రంగం సిద్ధమైంది, కిరణ్ బిజెపిలోకి రావడం సంతోషంగా ఉందన్న ఆయన చాలా మంది కీలమైన నేతలు త్వరలో బిజెపిలోకి రాబోతున్నారన్నారు. ఇక 2024లో ఎపిలో బిజెపి గెలవబొతుందని అన్నారు..
మాది సకల జనుల పార్టీ, దాని ఆధారంగా రాజకీయాలు జరుగుతాయని అన్నారు. ఇక ఢిల్లీలో కేసిఆర్ దగ్గర నుండి డబ్బులు తీసుకున్న చెంచా గాళ్ళే దర్నాలు చేస్తున్నారన్న ఆయన అవినీతికి వ్యతిరేకంగా మేము ఉంటాం కాబట్టి మేము కొన్ని విషయాల్లో కఠినంగా ఉంటామని అన్నారు. ఎవరైనా అవినీతిపరుడు అది సుబ్బారావు కావచ్చు, సుబ్బలక్ష్మి కావచ్చు.. జ్యోతిలక్ష్మీ కావాచ్చు, అవినీతి చేస్తే ఎవరైనా లోపల వేస్తారని అన్నారు. ఇక అ మాటల్నీ మీరు కేసిఆర్ ముద్దు బిడ్డలా తీసుకుంటే మేము ఏమి చేస్తామని ఆయన ప్రశ్నించారు. ఇక ఇరవైలక్షల వాచ్ పెట్టుకొనే వారినీ మీరు ప్రేమిస్తారు ఏమో సమాజం ప్రేమించదని ఆయన అన్నారు. అవినీతి మీదా దర్యాప్తు సంస్థల టార్గెట్ ఉంటుంది, దాంట్లో మాకు సంబంధం లేదన్న ఆయన పవన్ కల్యాణ్…కిరణ్ కుమార్ రెడ్డి ఎలా వెళ్ళాలనే కాంబినేషన్ పై పార్టీ నిర్ణయం తీసుకుంటుంది అని అన్నారు.