మద్యం అమ్మకాల్లో ప్రభుత్వ పెద్దల దోపిడీ.. బీజేపీ స్టడీ?
ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఏపీ ప్రభుత్వం మీద విమర్శల వర్షం కురిపించారు. మద్యం ధరల వల్ల గ్రామాల్లో ఎక్కువ గా నాటుసారా పెరిగిందని అన్నారు. విచ్చలవిడిగా నాటుసారా సరఫరా కావడం వల్లే మరణాలు సంభవిస్తున్నాయని అన్నారు. ప్రభుత్వం ఒక వైపు ప్రజా ధనాన్ని దోపిడీ చేస్తూ..మరో వైపు ప్రజల ఆరోగ్యం తో చెలగాటమాడుతోందని విమర్శించారు. ఎంత మద్యం విడుదల అవుతుంది? ఎంత అమ్మకాలు జరుగుతున్నాయి? అనే విషయం మీద దర్యాప్తు జరగాలని ఆయన అన్నారు. అసలు మద్యం షాపులకు ఏయే వాహనాలు వస్తున్నాయి? డబ్బులు ఎవరు కలెక్ట్ చేస్తున్నారో విలేకర్లు నిఘా పెట్టండని అన్నారు. డబ్బు కొంతే ప్రభుత్వానికి వస్తుంది, మిగతాదంతా ప్రైవేటు వ్యక్తులకు వెళ్ళిపోతుందని ఆరోపించారు. మద్యం అమ్మకాల్లో ప్రభుత్వం దోపిడి..ప్రభుత్వంలో ఉన్న పెద్దల దోపిడి జరుగుతుందని, చాలా కాలం నుండి దీనిపై స్టడీ చేస్తున్నానని అన్నారు.
ఇక స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ పై రాష్ట్ర ప్రభుత్వ వైఖరి ఏంటో చెప్పాలని డిమాండ్ చేసిన ఆయన నెల్లూరులో జెన్ కో ను ఆదానికి అమ్మేయాలని చూస్తున్నారు ఇది ప్రైవేటైజేషన్ కాదా? అని ప్రశ్నించారు. ఆర్టీసీలో ఎన్ని సొంత బస్సులు ఉన్నాయి..ఎన్ని ప్రైవేటు బస్సులు ఉన్నాయో వెల్లడించాలని అన్నారు. ప్రైవేటు దళారీలను, మిల్లర్లను ధాన్యం కొనుగోలు ను ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని, ఎమ్మెల్యే ద్వారంపూడి తండ్రి సివిల్ సప్లై చైర్మన్ అవ్వడం దౌర్భగ్యం అని అన్నారు. రాష్ట్రంలో ప్రతిది ప్రభుత్వం ప్రైవేటైజేషన్ చేస్తుందని, భయపడా..డబ్బులేకనా..ఎంతకాలం నష్టం పోవాలనా ఈ పనులు చేస్తున్నారు అని ప్రశ్నించారు.