Somesh Kumar: ఏపీ సీఎంతో సోమేశ్ కుమార్ భేటీ.. ఏ పదవి ఇస్తారో?
Somesh Kumar Meeting With Ys Jagan: మాజీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ గురువారం ఏపీ వెళ్లారు. అక్కడికి వెళ్లిన ఆయన ముందుగా ఏపీ సిఎస్ జవహర్ రెడ్డితో భేటీ అయి అనంతరం సీఎం వైఎస్ జగన్ తో భేటీ అయ్యారు. నిన్నమొన్నటి వరకు సోమేశ్ కుమార్ తెలంగాణ సీఎస్ గా ఉండేవారు. ఆయనను ఏపీ కేడర్ కి అలాట్ చేయడంతో ఆయన ఏపీకి వెళ్ళక తప్పలేదు. ముందుగా సోమేశ్ కుమార్ ఇవాళ హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్లారు. అక్కడి సచివాలయానికి వెళ్లి సీఎస్ జవహర్ రెడ్డితో భేటీ అయ్యారు. ఆ తర్వాత సీఎం జగన్ తో సోమేశ్ కుమార్ భేటీ అయ్యారు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం అప్పగించిన ఏ బాధ్యతలనైనా నిర్వహిస్తానని సోమేశ్ కుమార్ జగన్ ముందు ఆయన పేర్కొన్నట్టు తెలుస్తోంది. అయితే వీఆర్ఎస్ తీసుకొని తెలంగాణలో రాష్ట్రప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తారనే ప్రచారం కూడా జరగడంతో ఈ విషయం ఆలోచించలేదని సోమేశ్ కుమార్ ప్రకటించారు. అయితే తెలంగాణలో సీఎస్ గా పనిచేసిన సోమేశ్ కుమార్ కి ఏపీలో ఏ పోస్టింగ్ ఇస్తారు అనే చర్చ సాగుతోంది. ఇక జగన్ తో గంట పాటు భేటీ ఇవ్వడంతో సీఎంవోలోకి సోమేశ్ కుమార్ ను తీసుకుంటారా లేదా ఇతర శాఖలో కీలక బాధ్యతలు అప్పగిస్తారా అనే అంశం మీద చర్చ జరుగుతోంది.