Sirivennela Family: వైఎస్ జగన్ ను కలిసిన సిరివెన్నెల కుటుంబ సభ్యులు
Sirivennela Family Met Jagan: ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి సీఎం వైఎస్ జగన్‌ను దిగ్గజ సినీ గేయ రచయిత, పద్మశ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రి సతీమణి, కుటుంబ సభ్యులు కలిశారు. తమ కుటుంబాన్ని ఆదుకున్నందుకు సీఎం వైఎస్ జగన్‌ను కలిసి సిరివెన్నెల కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డితో సిరివెన్నెల అనుబంధాన్ని సీఎం జగన్ తో కుటుంబ సభ్యులు పంచుకున్నట్టు తెలుస్తోంది. ఇక సిరివెన్నెల అనారోగ్య సమయంలో కూడా చికిత్స ఖర్చులను జగన్ సర్కార్ భరించిన సంగతి తెలిసిందే. అలాగే సిరివెన్నెల మరణానంతరం ఆయన కుటుంబానికి విశాఖలో ఇంటి స్ధలం సైతం మంజూరు చేశారు సీఎం వైఎస్ జగన్. ఈ క్రమంలోనే ఆయనను కలిసిన సీతారామశాస్త్రి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. సిరివెన్నెల కుటుంబానికి అవసరమైన సాయం చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున పూర్తి సహకారం ఇవ్వనున్నట్లు ఆయన కుటుంబానికి ఏపీ సీఎం వైఎస్ జగన్ భరోసా ఇచ్చారు. ఇక సీఎం జగన్ ని సిరివెన్నెల సతీమణి పద్మావతి, కుమారులు యోగేశ్వర శర్మ, రాజా, కుమార్తె శ్రీ లలితా దేవి, సిరివెన్నెల సోదరుడు సీఎస్.శాస్త్రి వంటి వారు కలిశారు.