ఢిల్లీలోని రాజ్‌ఘాట్ వద్ద టీడీపీ నేతలు(TDP leaders) నివాళులు అర్పించారు. అనంతరం తెలుగు దేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్టుకు నిరసనగా నల్లబ్యాడ్జీలు ధరించి మౌనదీక్షకు దిగారు.
Nara Lokesh : ఢిల్లీలోని రాజ్‌ఘాట్ వద్ద టీడీపీ నేతలు(TDP leaders) నివాళులు అర్పించారు. రాజ్‌ఘాట్‌లోని మహాత్మాగాంధీ సమాధికి టీడీపీ నేత నారా లోకేశ్(Nara Lokesh )తో పాటు టీడీపీ ఎంపీలు, మాజీ ఎంపీలు అంజలి ఘటించారు. అనంతరం తెలుగు దేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్టుకు నిరసనగా నల్లబ్యాడ్జీలు ధరించి మౌనదీక్షకు దిగారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి రాజ్యాంగ వ్యతిరేక కార్యకలాపాలన్నిటిని రాజ్‌ఘాట్ నుంచే..తాము దేశ ప్రజల దృష్టికి తీసుకెళ్తున్నట్లు నారా లోకేశ్(Nara Lokesh ) చెప్పారు. ప్రతిపక్ష నేతలపై అక్రమ కేసులు బనాయిస్తూ తరచూ వేధిస్తున్నారని లోకేశ్ ఆరోపించారు.
సీఎం జగన్ అవినీతిపై, నిరంకుశ పాలన పైన కూడా వెంటనే కేంద్రం జోక్యం చేసుకోవాలని లోకేశ్ డిమాండ్ చేశారు. వెంటనే వైసీపీ ప్రభుత్వాన్ని రద్దు చేసి.. ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రపతి పాలన విధించాలని కోరారు.
మరోవైపు స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం (The Skill Development Scam)కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై హైకోర్టులో ఈ రోజు విచారణ జరగనుంది. దీంతో పాటు.. ఏసీబీ కోర్టులో చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన బెయిల్, మధ్యంతర బెయిల్ పిటిషన్‌పైనా కూడా ఈ రోజు విచారణ జరగనుంది. అలాగే సీఐడీ వేసిన కస్టడీ పిటిషన్‌పైన కూడా వాదనలు జరిగే అవకాశముంది.దీంతో సర్వ్రతా ఉత్కంఠ నెలకొంది.