రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో, ఆయురారోగ్య, అష్ట ఐశ్వర్యాలతో వర్థిల్లాలని శ్రీమహాలక్ష్మి అమ్మవారికి సీఎం జగన్ పట్టువస్త్రాలు సమర్పించారు.
AP CM JAGAN POOJA : రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో, ఆయురారోగ్య, అష్ట ఐశ్వర్యాలతో వర్థిల్లాలని, రాష్ట్రం (State) సమగ్రాభివృద్ధి చెందాలని విజయవాడ (Vijayawada)లో ఆరురోజులు (Sixdays)గా జరుగుతున్న శ్రీ లక్ష్మి మహాయాగం ముగిసింది.
చివరి రోజు మంగళవారం అఖండ పూర్ణాహుతి కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి (CM JAGAN MOHAN REDDY) పాల్గొన్నారు. సీఎంకు పూర్ణకుంభంతో వేద పండితులు స్వాగతం పలికారు. శ్రీమహాలక్ష్మి అమ్మవారికి సీఎం జగన్ పట్టువస్త్రాలు సమర్పించారు.
ఈ కార్యక్రమంలో విశాఖ (Visakha) శ్రీశారదా పీఠాధిపతి శ్రీ స్వరూపానందేంద్ర స్వామి, శ్రీ శారదా పీఠం ఉత్తరాధికారి శ్రీస్వాత్మానందేంద్ర స్వామి,అవధూత పీఠాధిపతి గణపతి సచ్చిదానందస్వామిజీ, మంత్రులు కొట్టు సత్యనారాయణ, బొత్స సత్యనారాయణ, టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి దంపతులు పాల్గొన్నారు.
రాజశ్యామల అమ్మవారు వేంచేసి ఉన్న వైఖానస యాగశాలలో పూర్ణాహుతి పూజా కార్యక్రమం నిర్వహించారు. పరమశివుడికి అత్యంత ప్రీతిపాత్రమైన నల్లకలువలతో వేదమంత్రోచ్ఛారణల మధ్య రుత్వికులు, ఘనాపాటిలు, పండితులు విశేష పూజా కార్యక్రమాలు చేపట్టారు. కంచి నుంచి ప్రత్యేకంగా తెప్పించిన స్వర్ణ ప్రతిమ రూపంలో ఉన్న అమ్మవారికి సీఎం జగన్ ప్రత్యేకంగా అభిషేకించారు.