తిరుమల శ్రీవారి ఆలయ పవిత్రోత్సవాల్లో(In temple In sacred ceremonies) భాగంగా రెండో రోజు అయిన సోమవారం శాస్త్రోక్తంగా పవిత్ర సమర్పణ (A holy offering )కార్యక్రమం జరిగింది.సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు శ్రీదేవి(Sridevi), భూదేవి(Bhoodevi) సమేత శ్రీమలయప్ప స్వామివారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిచ్చారు.
Tirumala : తిరుమల శ్రీవారి ఆలయ పవిత్రోత్సవాల్లో(In temple In sacred ceremonies) భాగంగా రెండో రోజు అయిన సోమవారం శాస్త్రోక్తంగా పవిత్ర సమర్పణ (A holy offering )కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఉదయం యాగశాలలో హోమాలు వంటి వివిధ వైదిక కార్యక్రమాలు చేపట్టారు. ఆ తరువాత సంపంగి ప్రాకారంలో వేడుకగా స్నపన తిరుమంజనం (Swapana Tirumanjanam) నిర్వహించారు. పాలు, పెరుగు, తేనె,చందనం, పసుపు వంటి సుగంధ ద్రవ్యాలతో విశేషంగా స్వామివారికి అభిషేకం చేశారు.
స్వపన తిరుమంజనం తర్వాత వేద ఘోష, మంగళ వాయిద్యాల నడుమ శ్రీవారి మూలవర్లకు, ఉత్సవ మూర్తులకు, జయ విజయులకు, గరుడాళ్వారుకు, వరద రాజస్వామివారికి, వకుళమాత అమ్మవారికి, యోగ నరసింహస్వామి వారికి, ధ్వజస్తంభం, బలిపీఠం, శ్రీ భూవరాహస్వామి వారికి, శ్రీ బేడి ఆంజనేయ స్వామి వారికి పవిత్రమాలలు(holy Garlands) సమర్పించారు.
ఇక సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు శ్రీదేవి(Sridevi), భూదేవి(Bhoodevi) సమేత శ్రీమలయప్ప స్వామివారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిచ్చారు. రాత్రి 8 నుంచి 11 గంటల వరకు యాగశాలలో వైదిక కార్యక్రమాలు జరిగాయి. దీనివల్ల ఆలయంలో కల్యాణోత్సవం(Kalyanotsavam), ఊంజల్ సేవ(Oonjal Seva), ఆర్జిత బ్రహ్మోత్సవం(Arjita Brahmotsavam), సహస్రదీపాలంకరణ ( Sahasradipalankarana)సేవలను టీటీడీ రద్దు చేసినట్లు అధికారులు చెప్పారు.
ఈ కార్యక్రమంలో తిరుమల పెద్దజీయర్ స్వామి, చిన్నజీయర్ స్వామి, ఈవో ధర్మారెడ్డి దంపతులు, ఆలయ డెప్యూటీ ఈవో లోకనాథం, పేష్కార్ శ్రీహరి ఇతర అధికారులు పాల్గొన్నారు.