వీక్షకులకు “మై సిటీ” సంక్రాంతి శుభాకాంక్షలు- ఊరూరా సంబరాలు
Sankranthi: తెలుగు రాష్ట్రాల్లో ఊరూరా సంక్రాంతి సందడి కనిపిస్తోంది. వీక్షకులకు మై సిటీ న్యూస్ నెట్ వర్క్.. మై సిటీ హైదరాబాద్ నుంచి ప్రతీ ఒక్కరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మీ ఆదరణ ఇలాగే ఉండాలని ఆకాంక్షిస్తున్నాం. ఈ పండుగ వేళ ప్రతీ ఇంటా భోగ భాగ్యాలు కలగాలని మీ మై సిటీ న్యూస్ నెట్ వర్క్ కోరుకుంటోంది.
పల్లెల్లో సంక్రాంతి సందడి మొదలైంది. మూడు రోజుల సంబరం శనివారం బోగి వేడుకలతో ప్రారంభం అయింది. ఆదివారం సంక్రాంతి, సోమవారం కనుమ పండుగ నిర్వహించుకోనున్నారు. పండుగను సొంత ఊళ్లలో జరుపుకోవడానికి జనం పట్టణాలు వదిలి. కుటుంబాలతో పల్లెలకు చేరు కుంటున్నారు. రెండు రోజులుగా జిల్లా కేంద్రంలోని బస్టాండ్, ఇతర కూడళ్లు జనంతో రద్దీగా కనిపి స్తున్నాయి. పట్టణాల నుంచి కుటుంబసభ్యుల రాక తో ప్రతీ ఇల్లు సందడిగా మారింది.
ముత్యాల ముగ్గులు,పల్లె పడుచు నవ్వులు,సిరి సిరి మువ్వలు , ముద్దు ముద్దు చిన్నారుల కిలకిలలతో పల్లెలు సందడిగా మారాయి. ఎటుచూసినా సంక్రాంతో శోభ ఉట్టిపడేలా పల్లెలు ముస్తాబయ్యాయి. నెలరోజులముందే సంక్రాంతి శోభ తెలుగురాష్ట్రల్లో ప్రవేశించింది. నిన్న భోగి సంబరాలు జరుపుకోగా నేడు అసలైన పండగ సంక్రాంతి.
భోగి మంటలు,పిండి వంటలు,కోడి పందేలు,పండగ పరుగులు, హరిదాసు కీర్తనలు,గంగిరెద్దు మేళంలు, జానపద కళారూపాలు, సంక్రాంతికి సొబగులు ఇవన్నీ కలబోసి పల్లెల్లో ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ఇక సామాన్య మానవుడినుండి పారిశ్రామికవేత్త వరకు ఈ సంక్రాంతికి సొంత ఊరు బాట పట్టాల్సిందే. ఇక రెండు తెలుగు రాష్టాల్లో ఈ పండుగలో చాలామంది రాజకీయ, సినీ ప్రముఖులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ తాడేపల్లి లోని క్యాంపు కార్యాలయంలో సంక్రాంతి వేడుకల్లో పాల్గొని అక్కడ ఏర్పాటుచేసిన సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించారు. అలాగే మాజీ ముఖ్య మంత్రి చంద్రబాబు తన సొంత స్వగ్రామమైన నారావారిపల్లెలో ఈ సంక్రాంతివేడుకలు జరుపుకుంటున్నారు. నిన్న భోగి మంటల్లో ప్రభుత్వం అక్రమంగా తెచ్చిన జీవో 1 కాపీలను తగులబెట్టి నిరసన చేపట్టారు. అలాగే మంత్రి అంబటి భోగి వేడుకల్లో చిందులేసి అందరిని ఆకర్షించారు. సంక్రాంతి అంటేనే ముందుగా అందరికీ గుర్తొచేది పిండి వంటలు. నోరూరించే ఘుమఘుమలు స్వాగతం పలుకుతాయి. ప్రతి ఇంటా సకినాలు, గారెలు, అరిసెలు వంటి రకరకాల పిండి వంటలను తయారు చేస్తారు. సంక్రాంతికి పది రోజుల ముందు నుంచే పిండివంటకాలు తయారుచేసేపనిలోఉంటారు ఇంట్లోని మహిళలు.