Sankranthi Holidays: సంక్రాంతి సెలవుల్లో మార్పు చేసిన ఏపీప్రభుత్వం
Sankranthi Holidays: ఆంధ్రప్రదేశ్ సర్కార్ సంక్రాంతి సెలవుల్లోస్వల్ప మార్పు చేసింది. ముందుగా జనవరి 11 నుంచి 16 వరకు సెలవులు ప్రకటించింది. అయితే వీటిని 12 నుంచి 17వ తేదీ వరకు మార్పులు చేశారు. ఇక ఇప్పుడు ఈనెల 18వ తేదీ వరకు సెలవులు పొడిగిస్తున్నట్లు తెలిపింది. ఆరు రోజులపాటు సెలవులను ప్రకటించింది.
తెలుగు ప్రజలకు సంక్రాంతి అతిపెద్ద పండుగ. తెలంగాణ లో కంటే ఆంధ్ర లో ఈ పండగను ఘనంగా జరుపుకుంటారు. ప్రపంచంలో ఎక్కడ ఉన్నాసరే సంక్రాంతి పండగకు వారి సొంత ఊరికి వచ్చి కుటుంబ సభ్యులతో గ్రామస్థులతో పండగను జరుపుకుంటారు. ఈ క్రమంలో రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు విద్యాసంస్థలకు సంక్రాంతి సెలవులను ఫిక్స్ చేసింది. తెలంగాణ లో 13 నుండి 17 వరకు పాఠశాలలకు సెలవులు ప్రకటించగా..ఏపీ సర్కార్ 12 నుండి 17 వరకు సెలవులను ప్రకటించింది. ముందుగా జనవరి 11 నుంచి 16 వరకు సెలవులను ప్రకటించింది. కానీ ఇప్పుడు సెలవుల్లో మార్పు చేసింది. దీంతో ఒకరోజు ఎక్కువగా విద్యార్థులు స్కూళ్లకు వెళ్లాల్సి వచ్చింది.