Tirumala Salakatla Teppotsavalu: తిరుమలలో శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు
Tirumala Salakatla Teppotsavalu: నేటి నుండి తిరుమలలో శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు జరగనున్నాయి. ఐదు రోజులపాటు ఈ వేడుకలను నిర్వహించనున్నారు. ఐదు రోజుపాటు ఈ తెప్పోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. ఈ వేడులక కోసం టీటీడీ ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ వేడుకలు నిర్వహించనున్న నేపథ్యంలో టీటీడీ వివిధ సేవలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నది. రాత్రి 7 గంటల నుండి 8 గంటల వరకు పుష్కరిణిలో స్వామి, అమ్మవారు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.
తెప్పోత్సవాల కారణంగా మార్చి 3,4 తేదీల్లో తోమాల సేవను, ఆర్చన, సహస్రదీపాలంకరణ సేవను, అదేవిధంగా మార్చి 5,6 తేదీల్లో తోమాల సేవ, అర్చన, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకరణ సేవలను, మార్చి 7వ తేదీన ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకరణ సేవలను టీటీడీ రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నది. సాలకట్ల తెప్పొత్సవాల సందర్భంగా ఈ సేవలను రద్దు చేస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది. సాలకట్ల తెప్పోత్సవాలకు పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకునే అవకాశం ఉండటంతో, భక్తులకు ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు టీటీడీ అధికారులు పేర్కొన్నారు. తెప్పొత్సవాల్లో భాగంగా తొలిరోజు శ్రీ సీతాలక్ష్మణ ఆంజనేయ సమేతంగా స్వామివారు శ్రీరామచంద్రమూర్తి అవతారంలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. పుష్కరిణి చుట్టూ ఊరేగింపుగా భక్తలకు దర్శనం ఇస్తారు. రెండో రోజు శ్రీకృష్ణుడి అవతారంలో స్వామివారు దర్శనం ఇవ్వనున్నారు.