CM Jagan: ఏప్రిల్ నుంచి విశాఖ రాజధానిగా పరిపాలన, సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు
Ruling from Vizag starts from April, says CM Jagan
విశాఖ రాజధానిగా ఏప్రిల్ నుంచి పాలన కొనసాగుతుందని సీఎం జగన్ ప్రకటించారు. మార్చి నెలాఖరుకు ఏర్పాట్లన్నీ పూర్తవుతాయని, ఏప్రిల్ నుంచి పాలన ప్రారంభం కానుందని తెలిపారు. జీ 20 సదస్సు సన్నాహక సమావేశం సందర్భంగా సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు.
మూడు రాజధానుల ద్వారా రాష్ట్రంలో అధికార వికేంద్రీకరణ స్పష్టంగా జరుగుతుందని సీఎం జగన్ చాలా గట్టిగా నమ్ముతున్నారు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అదే తమ విధానమని స్పష్టంగా చెబుతున్నారు. ప్రతిపక్షాల నుంచి అనేక విమర్శలు వచ్చినా వెనక్కి తగ్గలేదు. కోర్టులకు వెళ్లడం ద్వారా విపక్షాలు అడ్డంకులు కలిగించినా సీఎం జగన్ తన నిర్ణయానికే కట్టుబడుతూ వచ్చారు. ఆటంకాలను ఎప్పటికప్పుడు అధిగమిస్తూ ముందుకు అడుగులు వేస్తున్నారు.
ఏపీ మంత్రులు కూడా మూడు రాజధానుల విధానాన్ని బలంగా ప్రచారం చేశారు. సీఎం ఆలోచనలను ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో విజయం సాధించారు. అనేక ప్రాంతాల్లో సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి మూడు రాజధానుల ఆవశ్యకతను ప్రజలకు వివరించారు.
ఇటీవలే మంత్రి బొత్స ప్రభుత్వ ఉద్దేశ్యాన్ని మరోసారి ప్రకటించారు. ఒకటి రెండు నెలల్లో విశాఖ రాజధానిగా పాలన ప్రారంభం కానుందని తెలిపారు.విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కావాలనేది తమ కోరిక అని, అవుతుందని బొత్స అన్నారు.
అదే విధంగా మరో మంత్రి గుడివాడ అమర్ నాథ్ కూడా విశాఖలో ఏప్రిల్ నుంచి పాలన కొనసాగనుందని తెలిపారు. రిషికొండలో భవనాల నిర్మాణం పూర్తికాగానే కార్యాలయాల షిఫ్టింగ్ జరగనుందని తెలిపారు.