కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందారు. కొండాపురం మండలం చిత్రావతి వంతెన సమీపంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
Road Accident: కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందారు. కొండాపురం మండలం చిత్రావతి వంతెన సమీపంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. తుఫాను వాహనం లారీని ఢీకొట్టడంతో ఈ ఘటన జరిగింది. అతి వేగమే ప్రమాదానికి కారణమని స్థానికులు చెబుతున్నారు. తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లి వస్తుండగా.. ఈ ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదం జరిగిన స్పాట్ లోనే ఏడుగురు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. వాహనం నుజ్జు నుజ్జు అయింది. వాహనంలోనే చనిపోయిన వారి మృతుదేహాలు ఇరుక్కున్నాయి. ఈ ప్రమాదంలో మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిని తాడిపత్రి ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బాధితులు తాడిపత్రి, కర్ణాటకలోని బళ్లారికి చెందిన వారని తెలుస్తోంది.
ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు అక్కడికి చేరుకుని 108కు సమాచారం అందించి.. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. తాడిపత్రి సీఐ సుదర్శన్ ప్రసాద్, ఎస్సై సత్యనారాయణ ఘటనా స్థలం వద్ద పరిస్థితిని సమీక్షించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలను తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతి చెందిన వారిలో చిన్నారులు, మహిళలు కూడా ఉన్నారు. దీంతో తాడిపత్రిలోని వారి స్వగ్రామంలో విషాదం నెలకొంది.