వారం రోజుల కిందట రాజమండ్రిలో ఒక జోక్ జరుగుతోందని దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ కీలక వ్యాఖ్యలుచేసారు. ఎన్టీఆర్ శతజయంతోత్సవం సందర్భంగా ఆర్ జివి మీడియాతో మాట్లాడారు. స్వర్గంలో ఉన్న దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్‌టిఆర్‌కు కూడా నవ్వాలో ఏడవాలో అర్థం కాని పరిస్థితి నెలకొందన్నారు.
RGV: వారం రోజుల కిందట రాజమండ్రిలో ఒక జోక్ జరుగుతోందని దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ కీలక వ్యాఖ్యలుచేసారు. ఎన్టీఆర్ శతజయంతోత్సవం సందర్భంగా వర్మ మీడియాతో మాట్లాడారు. స్వర్గంలో ఉన్న దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్‌టిఆర్‌కు కూడా నవ్వాలో ఏడవాలో అర్థం కాని పరిస్థితి నెలకొందన్నారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎలాంటి వ్యక్తో ఎన్‌టిఆరే స్వయంగా చెప్పారని గుర్తు చేశారు. తాజాగా మరోసారి చంద్రబాబు పై మహానాడులో అయన ప్రవేశ పెట్టిన మేనిఫెస్టో పై ఆర్జీవీ ట్వీట్ చేసారు.
తెలుగు దేశం పార్టీ నిర్వహించిన మహానాడులో 2024లో రాబోయే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చే లక్ష్యంతో భవిష్యత్ కు గ్యారంటీ పేరుతో మినీ మేనిఫెస్టోని చంద్రబాబు ప్రకటించారు. ఈ మేనిఫెస్టో పై పలువురు వైసీపీ నేతలు మరోసారి ప్రజలను మోసం చేయడానికి చంద్రబాబు సిద్ధమయ్యారని అన్నారు. తాజాగా రాంగోపాల్ వర్మ మినీ మేనిఫెస్టో పై తనదైన స్టైల్లో ట్వీట్ చేసాడు. ఉచిత పథకాలతో ప్రజలంతా వచ్చే జన్మలోనూ పేదవాళ్ళగా పుట్టాలని కోరుకుంటారు. చంద్రబాబు ను గెలిపిస్తే ఆంధ్రప్రదేశ్ దారుణంగా తయారవుతుందని అన్నారు. పథకాలు ప్రగతికి అవసరం స్వార్ధపూరిత ఎదుగుదలకు కాదని ప్రకటించే పథకాలు క్యాన్సర్ లాంటివని వర్మ ట్వీట్ చేసాడు.
After going through the SUPER SIXER Freebee manifesto of TDP Party , I think all people should pray to GOD to be born poor in their next birth and the rest will be taken care by @ncbn
— Ram Gopal Varma (@RGVzoomin) June 1, 2023
Though welfare schemes are necessary and acceptable for social growth , @ncbn ‘s extremities for his own selfish growth will be like a CANCER for the STATE of AP
— Ram Gopal Varma (@RGVzoomin) June 1, 2023