Rgv : ఎన్టీఆర్ పాలిటిక్స్ లోకి వస్తే ఇదే సీన్.. వర్మ కామెంట్స్ వైరల్!
Rgv : జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ ఇస్తారా? ఇప్పుడు ఆయన పాన్ ఇండియా స్థాయిలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు హాలీవుడ్లో సైతం ప్రేక్షకులైన గుర్తు పడుతున్నారు. ఇలాంటి సమయంలో ఆయన సినిమాలను ఆపేసి రాజకీయాల్లోకి రారు అనేది దాదాపుగా అందరిలో ఉన్న అభిప్రాయం. అయితే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలంటే జూనియర్ ఎన్టీఆర్ లాంటి చరిష్మా ఉన్న వ్యక్తులు ఉండాలని తెలుగుదేశంలోని ఒక వర్గం భావిస్తుంటే ఆయనకి ఇంకా మంచి భవిష్యత్తు ఉంది సినిమాల్లో ఇంకా రాణించే అవకాశాలు ఉన్నాయి అవన్నీ వదులుకొని ఇప్పుడు రాజకీయాలు చేయడం ఎందుకు అని మరికొందరు సలహాలు ఇస్తున్నారు. అయితే ఈ విషయం మీద తాజాగా రామ్ గోపాల్ వర్మ తనదైన శైలిలో స్పందించారు. జూనియర్ ఎన్టీఆర్ కనుక తెలుగుదేశం పార్టీలోకి వస్తే లోకేష్ పని అయిపోతుందని ఆయన కామెంట్ చేశారు. తెలుగుదేశం పార్టీని కాపాడడానికి వెన్నుపోటు పొడిచారని, చంద్రబాబు కవర్ చేసుకుంటున్నారని ఈ సందర్భంగా వర్మ విమర్శించారు.
సీనియర్ ఎన్టీఆర్ అనే వ్యక్తి తెలుగుదేశానికి సమస్య అని 30 సంవత్సరాల క్రితం చంద్రబాబు పరోక్షంగా చెప్పాడని రాంగోపాల్ వర్మ కామెంట్ చేశారు. ఆ సమయంలో టిడిపికి తాను మెయిన్ అని చంద్రబాబు భావించారని అప్పుడు వారసత్వం తన కొడుకుకు ఇస్తాడే తప్ప జూనియర్ ఎన్టీఆర్కి ఇవ్వాల్సిన అవసరం ఏముందని వర్మ కామెంట్ చేశారు. అయితే జూనియర్ ఎన్టీఆర్ వెరీ బిగ్ సూపర్ స్టార్ అని పేర్కొన్న రాంగోపాల్ వర్మ చంద్రబాబు నాయుడు పార్టీ ముఖ్యమా కొడుకు ముఖ్యమా అని ఆలోచించుకోవాల్సిన అవసరం వచ్చిందని అన్నారు. అందుకే జూనియర్ ఎన్టీఆర్ స్థాయిలో లోకేష్ కు పాపులారిటీ రావాలని చంద్రబాబు కలగంటున్నారని అయితే జూనియర్ ఎన్టీఆర్ కూడా సరైన సమయం కోసం ఎదురుచూస్తున్నారని చెప్పుకొచ్చారు. చంద్రబాబు ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిస్తే జూనియర్ ఎన్టీఆర్ ముందు పోటు పొడుస్తారని వర్మ కామెంట్స్ చేశారు.
నిజానికి జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం కోసం 2009 ఎన్నికల్లో ప్రచారం చేశారు అప్పుడు యాక్సిడెంట్ కి గురి కావడంతో కాస్త దూరం జరిగారు. ఆ తర్వాత 2014 ఎన్నికల్లో కానీ 2019 ఎన్నికల్లో కానీ జూనియర్ ఎన్టీఆర్ ఎలాంటి రాజకీయ ప్రమేయంలోను జోక్యం చేసుకోలేదు. కానీ కొడాలి నాని పార్టీ మారి తెలుగుదేశం నుంచి వైసీపీలో చేరిన సమయంలో మాత్రం ప్రెస్ మీట్ పెట్టి కొడాలి నాని పార్టీ మారినంత వాగ్దానా నేను పార్టీ మారినట్టు కాదు నేను ఎప్పటికీ మా తాత స్థాపించిన తెలుగుదేశం పార్టీలోనే ఉంటాను అంటూ క్లారిటీ ఇచ్చుకున్న పరిస్థితులు అందరికీ తెలుసు. కొద్దిరోజుల క్రితం నారా లోకేష్ ఎన్టీఆర్ మాత్రమే కాదు రాష్ట్రంని అభివృద్ధి పథంలో నడిపించాలని కోరుకుంటున్న ఎవరైనా సరే రాజకీయాల్లోకి రావాలని ఆహ్వానించడంతో ఈ చర్చ మొదలైంది. ఇక సదరు ఇంటర్వ్యూలో చనిపోయిన వాళ్ళని చూడడం ఇష్టం ఉండదని తాను చూసినా చూడకపోయినా చనిపోయిన వ్యక్తి మళ్ళీ లేచి రాడు కానీ నాకు వాళ్లతో చివరిసారిగా గడిపిన జ్ఞాపకమే ఉండాలి సజీవంగా నాతో మాట్లాడిన జ్ఞాపకమే నాకు ఎప్పటికీ ముదిరించకపోయి ఉండాలని కామెంట్లు చేశారు.