RGV Clarity: వ్యూహం బయోపిక్ కాదు.. అసలు విషయం బయటపెట్టిన వర్మ!
RGV Clarity on Vyooham: ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బయోపిక్ త్వరలోనే చేస్తారని రాంగోపాల్ వర్మ గురించి జరుగుతున్న ప్రచారం మీద ఆయన క్లారిటీ ఇచ్చారు. తాను చేయబోయే సినిమా వైఎస్ జగన్ బయోపిక్ కాదని పేర్కొన్నారు ఆర్జీవీ. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణానంతరం జరిగిన రాజకీయ పరిణామాలు వైఎస్ జగన్ చుట్టూ జరిగిన పొలిటికల్ ప్రెజర్ అప్పటి స్థితిగతులను ఆధారంగా చేసుకుని ఈ సినిమా చేయబోతున్నట్లు ప్రకటించారు. ప్రజల్లో చర్చ జరుగుతున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నట్టు అది వైఎస్ జగన్ బయోపిక్ మాత్రం కాదని కేవలం వాస్తవ సంఘటన ఆధారంగా చేస్తున్న పొలిటికల్ థ్రిల్లర్ మూవీ అని చెప్పుకొచ్చారు. ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కాబోతోందని ఈ సందర్భంగా రామ్ గోపాల్ వర్మ క్లారిటీ ఇచ్చారు. ఇక ప్రస్తుతం రాంగోపాల్ వర్మ కోడిపందాలను వీక్షించేందుకు ఉపయోగపడే జిల్లాలు వెళ్లారు. అక్కడ వైసీపీ నేతలతో కూడా ఆయన మంతనాలు చేస్తున్న విషయం తెలిసిందే.