Rayapati: నాకు తెలియకుండా పేట సీటు ఇస్తే ఖచ్చితంగా ఓడిస్తా!
Rayapati Hot Comments: గుంటూరు జిల్లాకు చెందిన సీనియర్ నేత రాయపాటి సాంబశివరావు హాట్ కామెంట్స్ చేశారు. తాజాగా మీడియాతో మాట్లాడిన ఆయన రాజకీయాల్లో కష్టపడే వారికి టికెట్లు ఇవ్వాలని, మా కుటుంబం లో రెండు సీట్లు అడిగామని చెప్పుకొచ్చారు. ఈ విషయంలో అధిష్టానం సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. సత్తెనపల్లి, పెదకూరపాడు, గుంటూరు పశ్చిమలో ఎక్కడ సీటు ఇచ్చినా మా రాజకీయ వారసుడు రంగబాబు పోటీ చేస్తాడని ఆయన అన్నారు. ఇక నరసరావుపేట ఎంపీ సీటు కడప వాళ్లకు ఇస్తే ఓడిస్తామని పేర్కొన్న ఆయన దానికి మా వర్గం సహకరించదని తేల్చి చెప్పారు. ఇక నా సీటు మా అబ్బాయికి ఇవ్వాలని పేర్కొన్న ఆయన అవసరం అనుకుంటే నేనే పోటీ చేస్తానని అన్నారు. నేను పోటీలోకి దిగితే వీళ్ళు ఎవరు పనికి రారని, నా సీటు వేరే ఎవరికో ఇస్తానంటే చూస్తూ ఊరుకోమని అన్నారు. నాకు తెలియకుండా నరసరావు పేట సీటు ఇస్తే ఖచ్చితంగా ఓడిస్తానని అంటూ రాయపాటి హాట్ కామెంట్స్ చేశారు. ఇక పల్నాడు ప్రాంతంలో చంద్రబాబు సహకారంతో నేనే అభివృద్ధి చేశానని పేర్కొన్న ఆయన అలాంటి మాకు సీటు ఇవ్వక పోతే ఎలా? అని ప్రశ్నించారు. ఇక ఈ విషయం మీద టీడీపీ ఎలా స్పందిస్తుంది అనేది తెలియాల్సి ఉంది.