రాయలసీమలో భానుడు ఉగ్రరూపం దాల్చాడు. భగభగ మండుతున్నాడు. జనాలను బెంబేలెత్తిస్తున్నాడు. ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టకుండా చేస్తున్నాడు. రాయలసీమతో పాటు నెల్లూరు జిల్లాల్లో కూడా సూర్యుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. నెల్లూరులో 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అదే విధంగా రేణుగుంటలో 45.4 డిగ్రీలు, కడప, నంద్యాల, అన్నమయ్య జిల్లాల్లో 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
Rayalaseema is Burning now with Intense Heat
రాయలసీమలో భానుడు ఉగ్రరూపం దాల్చాడు. భగభగ మండుతున్నాడు. జనాలను బెంబేలెత్తిస్తున్నాడు. ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టకుండా చేస్తున్నాడు. రాయలసీమతో పాటు నెల్లూరు జిల్లాల్లో కూడా సూర్యుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. నెల్లూరులో 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అదే విధంగా రేణుగుంటలో 45.4 డిగ్రీలు, కడప, నంద్యాల, అన్నమయ్య జిల్లాల్లో 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
ఉదయం 9 గంటల నుంచే సూర్యుడు తన ప్రతాపం చూపిస్తుండడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావడానికి భయపడుతున్నారు. అత్యవసరం అయితే తప్ప బయటకు రావడం లేదు. భానుడి ప్రతాపానికి కొన్ని ప్రాంతాల్లో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని తెలియడంతో ప్రజలు భయభ్రాంతులకు గురౌతున్నారు. బయటకు వచ్చేటప్పుడు ఖచ్చితంగా గొడుగులు పట్టుకునే బయటకు వస్తున్నారు. త్వరత్వరగా పనులు ముగించుకుని ఇంటికి చేరుకుంటున్నారు.