Ram Gopal Varma: కోడిపందాలలో రాంగోపాల్ వర్మ
Ram Gopal Varma: ఏపీ, తెలంగాణలో నిన్న భోగి వేడుకలతో సంక్రాంతి వేడుకలు ప్రారంభమయ్యాయి. వేకువజామున చీకట్లను చీల్చుకుంటూ భోగి మంటల కాంతులు విరజిమ్మాయి. వాడవాడలా భోగిమంలు వేసి.. చిన్నాపెద్దా సందడి చేస్తున్నారు. తెల్లవారుజాము నుంచే భోగిమంటలు వెలిగించి.. పండగను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్నారు. భోగి మంటల్లో పాత సామాగ్రి వేసి అగ్ని దేవున్ని ప్రార్థిస్తున్నారు. నేడు సంక్రాంతి సంబరాల్లో ప్రజలు పాల్గొంటున్నారు.
ఇక సంక్రాంతి పండగ అంటే అందరికి గుర్తుకొచ్చేది కోళ్లపందాలు. ఈసారి ఈ కోళ్లపందాలలో పాల్గొనడానికి మొదటిసారి వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పాల్గొననున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు గొడవలు జరిగే అవకాశం ఉందని ఆయనను పంపించే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. మరోవైపు పవన్ కళ్యాణ్ అభిమానులు, జనసేన కార్యకర్తలు దాడి చేసే అవకాశం ఉందని అప్రమత్తమైన పోలీసులు ఆయనను తిరిగి హైదరాబాద్ వెళ్లిపోవాలని సూచిస్తున్నారు.
దీనిపై వర్మ స్పందిస్తూ తన మిత్రుల ఆహ్వానం మేరకు కోడిపందాలలో పాల్గొనడానికి ఇక్కడికి వచ్చాను అని చెపుతున్నారు. ఈమధ్య వర్మ వరుసగా పవన్ కళ్యాణ్ పై తనదైన స్టయిల్లో పోస్ట్ చేస్తున్నాడు. దీనిపై పవన్ ఫాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏ క్షణమైనా వర్మపై దాడి జరుగవచ్చు అనేకోణంలో పోలీసులు భారీగా మోహరించారు. అలాగే వర్మ ఎమ్మెల్యే ద్వారంపూడి చెంద్రశేఖర్ రెడ్డి తో ఆయన నివాసంలో భేటీ అయ్యారు.