Ram Gopal Varma: మళ్లీ పవన్ ను టార్గెట్ చేసిన వర్మ.. కమ్మోళ్లకు అమ్మేసినట్టే అంటూ కామెంట్స్!
Ram Gopal Varma Targets Pawan Kalyan Again: చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ భేటీ రాజకీయ వర్గాల్లో అనేక చర్చలకు కారణం కాగా, ఈ వ్యవహారంతో ఏమాత్రం సంబంధం లేని రాంగోపాల్ వర్మ ఎంట్రీ ఇచ్చి చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు. పవన్ ను టార్గెట్ చేస్తూ రామ్ గోపాల్ వర్మ చేస్తున్న కీలక వ్యాఖ్యలు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ దుమారం రేపుతున్నాయి. పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేస్తూ రాంగోపాల్ వర్మ డబ్బు కోసం తన సొంత కాపుల్ని కమ్మోళ్ళకి అమ్మేస్తాడని ఊహించలేదని టార్గెట్ చేశారు. రెస్ట్ ఇన్ పీస్ కాపులు.. కంగ్రాట్యులేషన్స్ కమ్మోళ్ళు అంటూ రాంగోపాల్ వర్మ ట్వీట్ చేయగా దానిపై కాపునాడు తీవ్రస్థాయిలో విరుచుకుపడింది.
ఇక అక్కడితో ఆగని రాంగోపాల్ వర్మ కాపులు – కాపులు x కాపులు + కమ్మోళ్ళు ÷ సేనలు – సేనలు ఇస్ నాట్ = ఓట్లు అంటూ వింత ట్వీట్ చేశారు. ఇప్పుడు కూడా ఒక ట్వీట్ చేసిన రామ్ గోపాల్ వర్మ ‘’కేఏ పాల్ బల్ల గుద్ది తనే నెక్స్ట్ సీఎం అంటున్నాడు. సిబి(చంద్రబాబు) కూడా గొంతెత్తి అదే పాట, అననిది ఒక్క పి(పవన్ కళ్యాణ్) ఒక్కడే. అంటే కమ్మ దొరలకి తల వంచేసినట్టేనా? యాజ్ ఏపి ఫ్యాన్, ఐ హర్టెడ్’’ అంటూ రాంగోపాల్ వర్మ ట్వీట్ చేశారు. పవన్ కళ్యాణ్ కమ్మ దొరలకి తల వంచేసినట్టేనా? అంటూ ఆయన చేసిన విమర్శ ఇప్పుడు వివాదాస్పదం అవుతోంది. ఈ క్రమంలో పవన్ అభిమానులు అతని మీద విరుచుకుపడుతున్నారు.
కే ఏ పాల్ బల్ల గుద్ది తనే నెక్ట్ సీఎం అంటున్నాడు
సి బి కూడా గొంతెత్తి అదే పాట
అననిది ఒక్క పి ఒక్కడే
అంటే కమ్మ దొరలకి తల వంచేసినట్టేనా ?
యాజ్ ఏ పి ఫ్యాన్ , ఐ హర్టెడ్ 😢😢😢
— Ram Gopal Varma (@RGVzoomin) January 11, 2023