Ram Gopal Varma: రామ్ గోపాల్ వర్మ వివాదాస్పద కామెంట్లు.. తినండి, తాగండి అంటూ!
Ram Gopal Varma: నాగార్జున యూనివర్సిటీ అకాడెమిక్ ఎగ్జిబిషన్ కార్యక్రమంలో పాల్గొన్న రామ్ గోపాల్ వర్మ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. చనిపోయిన తర్వాత రంభ, ఊర్వశి, మేనకలు ఉంటారని అపోహ పడుతుంటారు, కానీ ఒకవేళ వారు లేకపోతే ఎలా? అని వర్మ ప్రశ్నించారు. మీరు ఇక్కడే ఎంజాయ్ చేయండి అని యూనివర్సిటీ విద్యార్థిని విద్యార్థులకు ప్రొఫెసర్ల సాక్షిగా ముఖ్యఅతిథి రాంగోపాల్ వర్మ సూచనలు చేసినట్లు తెలుస్తోంది. అక్కడకు వచ్చిన విద్యార్థులకు తాగి , తిని సెక్స్ చేయండి అంటూ సూచనలు చేసినట్లు తెలుస్తోంది. వర్మ వ్యాఖ్యలతో మహిళా లెక్చరర్లు, విద్యార్థినులు షాక్ అయినట్టు చెబుతున్నారు. ఇక ఏదో ఒక వైరస్ వచ్చి సమాజంలో మగ జాతి అంతా పోవాలని, నేను ఒక్కడినే బతికి ఎంజాయ్ చేయాలనే కల ఉందని ఈ సందర్భంగా రామ్ గోపాల్ వర్మ చెప్పుకొచ్చారు. జీఎస్టీ -2 ఎప్పుడు అని విద్యార్థులు అడగ్గా మీ దగ్గర సెల్ ఫోన్ లు ఉన్నాయిగా మీరే తీసుకోవచ్చని రామ్ గోపాల్ వర్మ కామెంట్ చేశారు.