వైసీపీ ప్రభుత్వంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఫైర్ అయ్యారు. భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి దెబ్బతీసిన సీఎం జగన్ పై ప్రజా ఛార్జ్ షీట్ వేస్తున్నామని సోము వీర్రాజు తెలిపారు. ఉత్తరాంధ్రలో పెండింగ్ లో ఉన్న ఒక్క ప్రాజెక్ట్ ను కూడా పూర్తిచేయలేని అసమర్ధ ప్రభుత్వమిదని విమర్శించారు.
Praja Charge Sheet woll be filed on CM Jagan, says AP BJP Chief Somu Verraju
వైసీపీ ప్రభుత్వంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఫైర్ అయ్యారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పధకాలను తమ సొంత పథకాలుగా వైసీపీ ప్రభుత్వం చెప్పుకోవడం సిగ్గుచేటని అన్నారు.
గ్రామాల్లో మరుగుదొడ్లు నిర్మాణం, గృహానిర్మాణాలు, రైతు భరోషా కేంద్రాలు తదితర అభివృద్ధి కార్యక్రమాలన్నీ కేంద్రం నిధులతోనే జరుగుతున్నాయని సోము వీర్రాజు గుర్తుచేశారు. కేంద్రం నిధులను వైసీపీ కార్యకర్తలు పక్కదారి పట్టించడం తప్ప, ఒక్క అభివృద్ధిలో కూడా వారికి సంబంధం లేదని వీర్రాజు విమర్శించారు.
భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి దెబ్బతీసిన సీఎం జగన్ పై ప్రజా ఛార్జ్ షీట్ వేస్తున్నామని సోము వీర్రాజు తెలిపారు. ఉత్తరాంధ్రలో పెండింగ్ లో ఉన్న ఒక్క ప్రాజెక్ట్ ను కూడా పూర్తిచేయలేని అసమర్ధ ప్రభుత్వమిదని విమర్శించారు.
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తుల విషయం గురించి కూడా సోము వీర్రాజు ఈ సందర్భంగా ప్రస్తావించారు.బీజేపీ, జనసేన పొత్తుల విషయంలో పవన్ కళ్యాణ్ వెల్లడించిన అభిప్రాయాన్ని బీజేపీ అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లినట్లు సోము వీర్రాజు తెలిపారు.
వైసీపీ వ్యతిరేక ఓటు చీలకుండా చూస్తానని పదే పదే చెబుతున్న జనసేనాని పవన్ కళ్యాణ్ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీతో కలిసి బరిలో దిగాలని భావిస్తున్నారు. బీజేపీ మాత్రం టీడీపీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది. ఈ నేపథ్యంలో జనసేనాని ఎటువంటి రాజీ ప్రయత్నాలు చేస్తారో మరికొన్ని రోజుల్లో తేలనుంది.